top of page

ఈ పాము చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు..


పాము చాలా విష పూరితమైన జంతువు. ఒక్క కాటు గట్టిగా వేసిందంటే.. పరలోకాలకు గేట్లు తీసినట్లే. ప్రస్తుతం వర్షా కాలం కాబట్టి.. ఈ సీజన్‌లో పాములు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మన పక్కనే తిరుగుతూ ఉంటాయి. ఇలానే ఓ ఇంటి ముందుకు వేగంగా.. బుసలు కొడుతూ వచ్చింది పాము. ఆ పామును చూసిన జనం భయ పడకుండా.. పామును తరిమి కొడుతున్నారు. అయినా ఆ పాము బెదర కుండా.. అదరకుండా ఇంటి ముందుకు వస్తుంది. అప్పుడు ఇంటి సభ్యులు పాముపై చెప్పు విసిరారు. అంతే అదేదో చాక్లెట్ అన్నట్టు ఎంతో సంబర పడిందో లేక తినే వస్తువు అనుకుంటే కానీ.. లటుక్కున నోట్లో చెప్పును పట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా.. పెద్ద ఎత్తున పడగ విప్పి.. వేగంగా వెళ్లింది. కానీ ఆ చెప్పును మాత్రం అస్సలు వదిలి పెట్టకుండా.. తనతో పాటు తీసుకెళ్లింది. ఈ సంఘటన అంతా అక్కడున్న వారు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో మీరు కూడా చూసి నవ్వుకోండి.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page