top of page

Salaar: ఆ అనకొండ రికార్డ్‌పైనే డైనోసార్ కన్ను.. సలార్‌ మాస్ ర్యాంపేజ్ 🦖🌟

సలార్ సినిమాకి ఎక్కడ చూసినా పాజిటివ్ టాకే వినిపిస్తుంది. నిజానికి యావరేజ్ టాక్ వస్తేనే బాక్సాఫీస్‌ను ప్రభాస్ షేక్ చేస్తాడు. మరి ఇప్పడు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో బాక్సాఫీస్‌కి మూడినట్లే అంటూ పోస్టులు పెడుతున్నారు. బాహుబలి-2 తర్వాత డార్లింగ్ ప్రభాస్‌కి అలాంటి బ్లాక్ బస్టర్ ఒక్కటి కూడా పడలేదు. కానీ ఇప్పుడు సలార్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఆ కోరిక తీరిపోతుంది. ఎందుకంటే సలార్‌కి ఇప్పటివరకూ వచ్చిన టాక్ అయితే బ్లాక్ బస్టర్ అనే వినిపించింది. అందులోనూ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఆకలి మీద ఉన్నారు. 🎥💥

యావరేజ్ అని వినిపించినా బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ఎప్పటి నుంచో అంటున్నారు.. మరి అలాంటిది ఇప్పుడు బ్లాక్ బస్టర్ బజ్ రావడంతో బాక్సాఫీస్‌కి మూడినట్లే అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే అల్లాటప్పా రికార్డులు కాదు కానీ ఆ అనకొండ రికార్డే కొట్టాలంటూ కొంతమంది పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటో ఓ లుక్కేద్దాం. 🤩📈 కింగ్ షారుక్‌కి 2023 ఎప్పటికీ మర్చిపోలిని సంవత్సరం అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే జవాన్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఉన్న రికార్డులన్నింటినీ కింగ్ ఖాన్ చెరిపేశాడు. ప్రపంచవ్యాప్తంగా జవాన్ రూ.1154 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2023లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా రికార్డ్ సృష్టించింది. దీంతో ఇప్పుడు ప్రభాస్ 'సలార్' చిత్రం జవాన్‌ను అధిగమించి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టుకుంటుందా లేదా అనేదే అసలు ప్రశ్న. 🎬💰 నిజానికి సలార్ పెద్దగా ప్రమోషన్స్ కూడా చేపట్టలేదు. అయితే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో మాత్రం సలార్ ఓ ఇంటర్వ్యూ చేసింది. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్, ప్రశాంత్‌ నీల్‌ను రాజమౌళి ఇంటర్వ్యూ చేసి ఇంట్రెస్టింగ్ విషయాలు అందరికీ తెలిసేలా చేశారు. ఇది మినహా సలార్ పెద్గగా ప్రమోషన్స్ చేసిందేం లేదు. కానీ సినిమాపై మాత్రం గట్టి నమ్మకం పెట్టుకుంది మూవీ టీమ్. దానికి తగ్గట్లే డార్లింగ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో మాములు హడావిడి చేయలేదు. ఇక ఇప్పుడు సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ట్విట్టర్‌లో దున్

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page