top of page

పోలీసులకు తలనొప్పిగా మారిన కేబుల్‌ బ్రిడ్జి..🚓👮🚧

🚓హైదరాబాద్‌లోని దుర్గం చెరువు బ్రిడ్జి ఇప్పుడు సూసైడ్ స్పాట్‌కి అడ్డాగా మారింది.గత కొద్దిరోజులుగా వరుసగా జరుగుతున్న ప్రమాదలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. 👮🚧 ఓ వైపు ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్న అవి పెద్దగా ఫలితం ఉండటం లేదు.

🚓హైదరాబాద్‌లోని దుర్గం చెరువు బ్రిడ్జి ఇప్పుడు సూసైడ్ స్పాట్‌కి అడ్డాగా మారింది.గత కొద్దిరోజులుగా వరుసగా జరుగుతున్న ప్రమాదలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. 👮🚧 ఓ వైపు ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్న అవి పెద్దగా ఫలితం ఉండటం లేదు. 🤔 దీంతో ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. 🚓📋 దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి చూసేందుకు రోజు వందల మంది వస్తుంటారు. 🚶పుట్టిన రోజు మొదలు ఇతర ఈవెంట్‌లను కేబుల్ బ్రిడ్జిపై జరుపుకునేందుకు యూత్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి వారిని గుర్తించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. 👀👮 ఆత్మహత్య చేసుకోవాలనే వారికి బ్రిడ్జి సులువుగా ఉంది. ⚠️💧 నీటిలో దూకిన వారిని కాపాడటం కూడా అసాధ్యం. 😢🌊 ఈ ఆత్మహత్యలు నిరోధించడానికి పోలీసులు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. 24 గంటల పాటు కేబుల్ బ్రిడ్జి పై నిఘా ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 🏗️🛠️ బ్రిడ్జిపై అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల కదలికల పై నిఘా పెట్టనున్నారు. 😮 ఎక్కువ సేపు వచ్చి బ్రిడ్జి పరిసరాల్లో ఉంటే పంపించేలా ప్రణాళిక చేస్తున్నారు. మరో వారం రోజుల్లో కేబుల్ బ్రిడ్జిపై పటిష్ట చర్యల దిశగా అడుగులు వేస్తున్నారు పోలీసులు. 🚔పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాల్సి ఉంది.


Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page