top of page
Suresh D

చరిత్ర పురుషుడిగా రామ్‌చరణ్‌.. డైరెక్టర్‌ ఎవరంటే? 🎥

తాజా సమాచారం మేరకు రామ్‌చరణ్‌తో ఆయన సినిమా సెట్‌ అయినట్టు వినికిడి. చరణ్‌ రెండుమూడుసార్లు ఈ మధ్య ముంబయి వెళ్ళివచ్చారు. కారణం ఈ సినిమానే అనే టాక్‌ బలంగానే వినిపిస్తుంది.

రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘గేమ్‌ఛేంజర్‌' పూర్తిచేసే పనిలోఉన్నారు. ఈ ఏడాది దసరాను టార్గెట్‌గా తీసుకొని చకచకా చిత్రీకరణ జరుపుకుంటున్నదీ సినిమా. ఈ చిత్రం తర్వాత ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటించనున్న విషయం తెలిసిందే. ‘ఆర్‌సీ16’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. 🎬

రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘గేమ్‌ఛేంజర్‌’ పూర్తిచేసే పనిలోఉన్నారు. ఈ ఏడాది దసరాను టార్గెట్‌గా తీసుకొని చకచకా చిత్రీకరణ జరుపుకుంటున్నదీ సినిమా. ఈ చిత్రం తర్వాత ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటించనున్న విషయం తెలిసిందే. ‘ఆర్‌సీ16’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. 🎬 ఇదిలావుంటే.. అప్పుడు ‘ఆర్‌సీ17’కు సంబంధించిన న్యూస్‌ కూడా మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తుండటం విశేషం. సంజయ్‌లీలా బన్సాలీ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయనున్నారట.

నిజానికి అల్లు అర్జున్‌ హీరోగా సినిమా చేసేందుకు సంజయ్‌ గతంలో ప్రయత్నించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. తాజా సమాచారం మేరకు రామ్‌చరణ్‌తో ఆయన సినిమా సెట్‌ అయినట్టు వినికిడి. చరణ్‌ రెండుమూడుసార్లు ఈ మధ్య ముంబయి వెళ్ళివచ్చారు. కారణం ఈ సినిమానే అనే టాక్‌ బలంగానే వినిపిస్తుంది. సంజయ్‌ హిస్టారికల్స్‌ తీయడంలో దిట్ట. ఆయన నిర్దేశకత్వంలో వచ్చిన బాజీరావ్‌ మస్తానీ, పద్మావత్‌ చిత్రాలు ఘనవిజయాలను నమోదు చేసుకున్నాయి. చరణ్‌తో చేబోతున్న సినిమా కూడా హిస్టారికల్‌ మూవీనే అని తెలిసింది. శ్రావస్టి సామ్రాజ్యానికి చెందిన ఓ చక్రవర్తి, తన కొద్దిమంది సైన్యంతో ఘాజీ సలార్‌ మసూద్‌ని ఓడించి మట్టికరిపించిన వీరోచిత గాధ ఆధారంగా ఈ సినిమా రూపొందిచనున్నట్టు సమాచారం. బుచ్చిబాబు సినిమా తర్వాత, వెంటనే రామ్‌చరణ్‌ చేయనున్న సినిమా ఇదే అని వినికిడి. అంటే త్వరలో రామ్‌చరణ్‌ని చరిత్రపురుషునిగా చూడబోతున్నాం అన్నమాట. 🎬

bottom of page