top of page

సీతాకోక చిలుకలు మట్టిలో ఉప్పు సేకరిస్తున్న అద్భుత దృశ్యం…


మన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు వీక్షించేందుకు రెండు కళ్లు సరిపోవు. ఆస్వాదించగల మనస్సుండాలే గానీ, ఎన్నో అందాలు ఉన్నాయి. పచ్చని మొక్కలు, కొండలు, లోయలు, పక్షులు, వాటి కిలకిల రావాలు, పసిపిల్లల బోసినవ్వులు, పూలు, వాటిపై వాలే తుమ్మేదలు, సీతాకోక చిలుకలు విహరించే దృశ్యాలు అడుగడునా మనల్ని ఆకట్టుకుంటాయి. కొన్ని సార్లు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు కూడా వైరల్‌ అవుతుంటాయి. గుంపులు గుంపులుగా సీతాకోక చిలుకలు కనిపించినపుడు వావ్‌ అనిపిస్తుంది. ఇవన్నీ ఓ సందర్భంలో గుంపులుగా చేరతాయి. అదే మడ్ పుడ్లింగ్. ఈ సందర్భంలో ఒకచోటకి చేరిన సీతాకోక చిలుకల వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ షేర్ చేశారు. వీడియోకి క్యాప్షన్‌గా మడ్ పుడ్లింగ్ అని పేర్కొ్న్నారు. ఇలా గుంపులుగా చేరిన సీతాకోక చిలుకలు బురద నేలలలో ఉన్న లవణాలు, ఖనిజాలను సేకరిస్తాయని వివరించారు.. ఇలా సేకరించడాన్ని మడ్ పుడ్లింగ్ అంటారు. ఆడ సీతాకోక చిలుకల్ని ఆకర్షించడానికి మగ సీతాకోక చిలుకలు ఇలా లవణాలు, ఫెరోమోన్లను సేకరిస్తాయని చెప్పారు. అలా ఓ చోటకి చేరి లవణాలు సేకరిస్తున్న అందమైన సీతాకోక చిలుకల గుంపును తన కెమెరాలో బంధించిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి దానిని ఇంటర్‌నెట్‌లో పోస్ట్‌ చేయగా, అది కాస్త వైరల్‌ అవుతోంది.



コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page