top of page
Suresh D

బస్ డ్రైవర్ గుండె ధైర్యం.. బుల్లెట్ దిగినా ప్రయాణికులను రక్షించేందుకు 30 కిలోమీటర్లు డ్రైవింగ్🙌

అర్ధరాత్రి దొంగలు తరుముతున్నా భయపడని ఓ బస్సు డ్రైవర్ 35 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు.

అర్ధరాత్రి దొంగలు తరుముతున్నా భయపడని ఓ బస్సు డ్రైవర్ 35 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. కారులో బస్సును వెంబడించిన దోపిడీ దొంగలు.. 🚓 తుపాకులతో రెచ్చిపోయారు. 💥 ఏకంగా బస్సు డ్రైవర్ లక్ష్యంగా కాల్పులకు దిగారు. అయితే దుండగులు కాల్పులు జరుపుతున్నా.. బెదరకుండా ముందుకు కదలిన బస్సు డ్రైవర్.. తన బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 🙌 దోపిడీ దొంగలు ఓ వైపు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా.. ☔ డ్రైవింగ్‌ను మాత్రం వదల్లేదు. బస్సును ఎక్కడా ఆపకుండా 30 కిలోమీటర్ల పాటు తీసుకెళ్లాడు. 🛤️చివరికి అందులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా కాపాడాడు. 👍 దీంతో ఆ బస్సు డ్రైవర్ చూపించిన తెగువకు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

bottom of page