👧 సంజనా గణేశన్ ఇటీవల ఒక కొడుకుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె బరువు మునుపటిలా పెరిగింది. సంజన ఈ వీడియోపై ఒక యూజర్ ఆమెను లావుగా ఉన్నావంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. సంజన.. ఆ యూజర్‌కి రిప్లై ఇస్తూ.. మీకు స్కూల్ సైన్స్ పాఠ్యపుస్తకం కూడా గుర్తుండదని, పెద్ద పెద్ద ఆడవాళ్ల శరీరాల గురించి వ్యాఖ్యానిస్తుంటారని ఫైర్ అయింది. ఇక్కడి నుంచి పారిపో అంటూ యూజర్‌పై విరుచుకపడింది.
👩 సంజన వీడియోపై వ్యాఖ్యానిస్తూ, రాజా రాయ్ అనే వినియోగదారు “భాభి లావుగా కనిపిస్తున్నావు” అంటూ రాసుకొచ్చాడు. సంజన వీడియోపై ఈ యూజర్ మాత్రమే కాకుండా ఇతర వ్యక్తులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ అనే వినియోగదారుడు సోదరా, ఆమె చాలా లావుగా మారింది. ఇంతకుముందు ఇలా లేదు అంటూ మాట్లాడుకున్నారు. సంజన చెప్పిన సమాధానంపై అంతా నిజమే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. గర్భం దాల్చిన తర్వాత స్త్రీ బరువు పెరగడం సహజం కదా అంటూ మద్దతు తెలుపుతున్నారు.
🎤 సంజనా గణేశన్ స్పోర్ట్స్ యాంకర్ అనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బుమ్రాను పెళ్లి చేసుకోకముందే ఆమె గురించి జనాలకు తెలుసు. బుమ్రాతో రిలేషన్‌షిప్ తరువాత, వారిద్దరూ మార్చి 2021 లో వివాహం చేసుకున్నారు. బుమ్రా, సంజన గతేడాది సెప్టెంబర్‌లో తల్లిదండ్రులు అయ్యారు. వీళ్లకు కొడుకు పుట్టాడు. 🌟