top of page

సింహానికి సుస్సు పోయించిన గేదెలు..


అడవికి సింహం రాజు అన్న విషయం తెలిసిందే. దాని దర్జా తెలిసిందే. ఇక తెలివిగా వేటాడంలోనూ.. తమ ప్రత్యేకతను చాటుకుంటాయి మాటు వేసి.. పంజాలతో ఒక్కసారిగా దాడి చేసి.. పదునైన పళ్లతో గొంతు పట్టి.. అవతలి జీవిని ఆహారంగా మలుచుకుంటాయి పులులు. అందుకే ఎలాంటి జీవి.. సింహానికి ఎదురుపడాలి అనుకోదు.  కానీ మందంగా ఉంటే.. కొన్ని జీవులు అవతల ఎంత పెద్ద జీవి ఉన్నా కూడా ఎదురుతిరుగాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. అడవిలో ఒక నియమం ఉంటుంది. మీ బలం, తెలివితో ప్రాణాలను కాపాడుకోవచ్చు.. ప్రాణాలు తీయొచ్చు. ఈ అడవి చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. తాజాగా వీడియోలో గేదెలు మందగా ఏర్పడి సింహానికి సుస్సు పోయించాయి. గేదెల దాటికి.. సింహం పరుగులు తీసింది. వైరల్ అవుతున్న వీడియోలో, గేదెల మందను చూసి.. భయపడిన సింహం విరిగిన చెట్టుపైకి ఎక్కడం మీరు చూడవచ్చు. గేదెలు వెనక్కి తగ్గకుండా ఆ సింహాన్ని చుట్టుముట్టాయి. ఆ గేదెల మంద.. పెద్దదిగా ఉండటంతో… సింహం భయపడక తప్పలేదు. ప్రాణభయంతో చెట్టు ఎక్కినా కూడా గేదెలు వదలకుండా.. ఆ చెట్టుపై దాడి చేయడం ప్రారంభించాయి. ఆ కొమ్మ విరిగిన వెంటనే, సింహం తోక ముడిచి అక్కడి నుండి పారిపోయి.. ప్రాణాన్ని కాపాడుతుంది.

ఈ వీడియోను లేటెస్ట్ సైటింగ్స్ అనే ఖాతా ద్వారా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ దృశ్యాలను దక్షిణాఫ్రికా అడవిలో.. నిక్ ఆండ్రూ అనే వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ చిత్రీకరించారని తెలిసింది. వార్త రాసే వరకు, 28 లక్షల మందికి పైగా ఈ వీడియోను షేర్ చేశారు.




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page