top of page

గ్రామీ అవార్డుల్లో బీటీఎస్‌కు మళ్లీ మొండిచేయి.. కొరియన్ బ్యాండ్ ఫ్యాన్స్ అసంతృప్తి🏆🎵

66వ గ్రామీ అవార్డుల వేడుక ఆదివారం (ఫిబ్రవరి 4) రాత్రి ఘనంగా జరిగింది. అయితే ఇందులో కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్‌ (BTS)కు మరోసారి మొండిచేయి చూపడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.🏆🎵

ప్రపంచ మ్యూజిక్ అవార్డుల్లో అతి పెద్దదిగా భావించే గ్రామీ అవార్డుల వేడుక ఆదివారం (ఫిబ్రవరి 4) రాత్రి ఘనంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖ మ్యుజీషియన్లు, సింగర్స్ ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకొని ఎంతో గర్వంగా ఫీలయ్యారు. 

అయితే కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్ (BTS)కు మాత్రం ఈసారి కూడా అవార్డు దక్కలేదు. ఈ అవార్డు వచ్చి ఉంటే కనుక ప్రస్తుతం సౌత్ కొరియా మిలిటరీలో పని చేస్తున్న బ్యాండ్ సభ్యులకు విముక్తి లభించేది కదా అని వాళ్లు అంటుండటం గమనార్హం. 

బీటీఎస్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా గ్రామీ అవార్డుల కోసం నామినేషన్లు కూడా వచ్చాయి. కానీ గ్రామీ మాత్రం దక్కలేదు. దీంతో ఆర్మీగా తమను తాము పిలుచుకునే ఈ బ్యాండ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. నిజానికి 2023లో ఈ బ్యాండ్ నుంచి మంచి మ్యూజిక్ వచ్చిందని వాళ్లు వాదిస్తున్నారు. అంతేకాదు ఒకవేళ బ్యాండ్ కు గ్రామీ వచ్చి ఉంటే కొరియన్ మిలిటరీ నుంచి బ్యాండ్ సభ్యులు బయటకు వచ్చే వాళ్లనీ అంటున్నారు.

ఇప్పటి వరకూ రెండుసార్లు గ్రామీ నామినేషన్లను బీటీఎస్ అందుకుంది. అయితే అవార్డు మాత్రం రాలేదు. 2022లో ఈ గ్రామీ అవార్డుల ఉత్సవంలో పాల్గొన్న బీటీఎస్ సభ్యులు ఈ అవార్డు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే బ్యాండ్ సభ్యులు ఈ మాట అనడం వెనుక ఓ బలమైన కారణం ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. 

సౌత్ కొరియాలో ఎలాంటి అంగ వైకల్యం లేని ప్రతి పురుషుడు రెండేళ్ల పాటు కచ్చితంగా దేశ మిలిటరీకి సేవలందించాలన్న నిబంధన ఉంది. బీటీఎస్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత బ్యాండ్ అందించిన సభ్యులకు కూడా ఇందులో మినహాయింపు లేదు. ప్రస్తుతం ఈ బీటీఎస్ సభ్యులు మిలిటరీలోనే ఉన్నారు. అయితే ఒకవేళ గ్రామీ అవార్డు గెలిచి ఉంటే వాళ్లకు రెండేళ్ల తప్పనిసరి సర్వీసు నుంచి బయటకు వచ్చే వాళ్లన్నది ఫ్యాన్స్ వాదన.

గతంలో ప్రపంచంలోని పలు ప్రతిష్టాత్మక అవార్డులు గెలిచిన అథ్లెట్లు, మ్యుజీషియన్లను కొరియా ఇలా మిలిటరీ విధుల నుంచి మినహాయింపు ఇచ్చిన ఉదంతాలను గుర్తు చేస్తున్నారు. దీంతో బీటీఎస్ కు గ్రామీ ఇవ్వకపోవడాన్ని ఫ్యాన్స్ మరింత తప్పుబడుతున్నారు. ఈసారైనా ఈ ప్రతిష్టాత్మక అవార్డు వచ్చి ఉంటే బ్యాండ్ సభ్యులు మిలిటరీ నుంచి బయటకు వచ్చే వాళ్లు కదా అని అభిమానులు అంటున్నారు. 

సౌత్ కొరియాలో గతంలో ఇలాంటి అవార్డులు గెలిచిన వాళ్లకు మినహాయింపు ఇచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. 2009లో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ పియానో కాంపిటిషన్ గెలిచిన కొరియా పియానిస్ట్ చో సియోంగ్ జిన్ కు మిలటరీ సేవల నుంచి మినహాయింపు లభించింది. ఇక ఏషియన్ గేమ్స్ లో జపాన్ ను ఓడించి గోల్డ్ మెడల్ గెలిచిన ఫుట్ బాల్ టీమ్ కు కూడా ఇదే మినహాయింపు దక్కింది.🏆🎵

bottom of page