top of page

😧శ్రీచైతన్య సంస్థల అధినేత బీఎస్ రావు కన్నుమూత😲

ప్రముఖ విద్యావేత్త, శ్రీచైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు (BS Rao) కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆయన.

గుండెపోటుతో గురువారం (జూలై 13) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యులు ఆయన భౌతికకాయాన్ని విజయవాడ తరలించనున్నారు. విజయవాడలో రేపు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.😱 ఉన్నత విద్యాభ్యాసం చేసిన డాక్టర్ బీఎస్ రావు తొలుత ఇంగ్లాండ్‌, ఇరాన్‌లో వైద్యుడిగా సేవలు అందించారు. 1986లో విజయవాడలో ‘శ్రీచైతన్య బాలికల జూనియర్‌ కాలేజీ’ని ప్రారంభించారు. ఆయన వేసిన ఈ అడుగు ఆ తర్వాత కాలంలో విద్యా రంగంలో పెను మార్పులకు కారణమైంది. 😈అనతి కాలంలోనే మంచి గుర్తింపు రావడంతో విద్యాసంస్థలను అంచెలంచెలుగా విస్తరించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నింట్లో తమ సంస్థలను ప్రారంభించారు. శ్రీచైతన్య ఎడ్యుకేషన్ గ్రూప్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 321 జూనియర్‌ కాలేజీలను, 322 టెక్నో స్కూళ్లను, 107 సీబీఎస్‌ఈ స్కూళ్లను నడుపుతోంది. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో సుమారు 8.5 లక్షల మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. శ్రీచైతన్య ఐఏస్ అకాడెమీ (Sri Chaitanya IAS Academy)లను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల కార్యకలాపాలన్నింటినీ కుటుంబసభ్యులే చూసుకుంటున్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page