top of page

జేబీఎస్ - శామీర్‌పేట డబుల్‌ డెక్కర్‌ స్కైవే.. ప్రయాణం మరింత ఈజీ!🚆🛣️✨

తాజాగా.. నగరానికి మణిహారంగా నిలిచే మరో ప్రతిపాదన సిద్ధమైంది. జూబ్లీ బస్టాండ్‌ (JBS) నుంచి శామీర్‌పేట మధ్యలో డబుల్‌ డెక్కర్‌ స్కైవే నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తాజాగా.. నగరానికి మణిహారంగా నిలిచే మరో ప్రతిపాదన సిద్ధమైంది. జూబ్లీ బస్టాండ్‌ (JBS) నుంచి శామీర్‌పేట మధ్యలో డబుల్‌ డెక్కర్‌ స్కైవే నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్మాణంతో హైదరాబాద్‌ - కరీంనగర్ రూట్‌లో ప్రయాణం మరింత వేగంగా, సాఫీగా జరగనుంది. ఇటీవల కేంద్రం వద్ద ఈ స్కైవే ప్రతిపాదన ఉంచగా.. సానుకూలత వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌ వెల్లడించారు. డబుల్‌ డెక్కర్‌ స్కైవే మూడంచెల పద్ధతి ఉంటుందని ఆయన చెప్పారు. పైభాగంలో మెట్రోరైలు, మధ్యలో ఫ్లై ఓవర్, కిందిభాగంలో రోడ్డు ఉంటుందని తెలిపారు.

ఈ డబుల్ డెక్కర్ స్కైవే పనులు పూర్తయ్యే నాటికి రూ. 5 వేల కోట్లు ఖర్చు అవుతుందని వినోద్ కుమార్ వెల్లడించారు. కరీంనగర్‌ మార్గంలో JBS నుంచి శామీర్‌పేట వరకు 18.5 కిలోమీటర్ల పొడవు డబుల్‌ డెక్కర్‌ స్కైవే నిర్మాణాన్ని ప్రతిపాదించినట్లు చెప్పారు.🚗🏙️🚆


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page