🗳️ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. 👤 అధికార పార్టీ బీఆర్ఎస్‌పై రాహుల్ చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. 💥
రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. 💬 కుటుంబ పాలన, అవినీతిపై కాంగ్రెస్ నేతలకు మాట్లాడే హక్కులేదంటూ విమర్శిస్తున్నారు. 🔊 తెలంగాణ కుటుంబ పాలన కొనసాగుతుందని.. బీఆర్‌ఎస్.. బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనంటూ రాహుల్ మాట్లాడటం సిగ్గుచేటంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 🙌 నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఎవరు..? రాహుల్, ప్రియాంక సమాధానం చెప్పాలి.. 🤷♂️ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. 🤔 కాంగ్రెస్ ను ఎవరూ నమ్మరంటూ కౌంటర్ ఇచ్చారు. 🗣️
🚨 బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ చేసిన విమర్శలను తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి తిప్పికొట్టారు. 🎤 కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అసత్యాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 👀 వారసత్వ రాజకీయాలపై రాహుల్ మాట్లాడడం పెద్ద జోక్ అని అన్నారు. 😄 రాహుల్‌గాంధీది ఐదు తరాల వారసత్వం అంటూ నిరంజన్‌రెడ్డి కౌంటరిచ్చారు. 💪