top of page

🔥 రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్న బిఆర్ స్ 🌋

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై చేసిన కామెంట్స్‌ను బీఆర్ఎస్‌ తీవ్రంగా తప్పు పడుతోంది.బీఆర్ఎస్‌ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే కాంగ్రెస్ నాయకుడు అందుకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

తెలంగాణలో కేసీఆర్ సర్కారు రైతులకు 24 గంటల ఉచిత కరెంటుకు వ్యతిరేకంగా టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం మేడ్చల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టారు. దీనికి మంత్రి మల్లా రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా దగ్గర బీఆర్ఎస్‌ శ్రేణులు ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి 3 గంటల కరెంటు సరిపోతుందని ఉచిత కరెంటుపై రేవంత్‌రెడ్డి కామెంట్స్‌ని తప్పు పడుతూ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్నం చేశారు. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రైతులు, BRS పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.వ సూర్యాపేట జిల్లా కోదాడలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ రాంనగర్ చౌరస్తాలో కూడా ధర్నా నిర్వహించారు. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్దం చేశారు. వరంగల్ నాయుడు పంపు జంక్షన్‌లో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పల్లె పల్లెల్లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు బీఆర్ఎస్‌ శ్రేణులు. కాంగ్రెస్‌ పార్టీ ముమ్మాటికి రైతు వ్యతిరేక పార్టీ అని..రేవంత్‌రెడ్డి రైతులకు నష్టం కలిగించాలని చూస్తున్నారని నినాదాలుచేశారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page