🗳️ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకునేందుకు రెడీ అవుతున్నాయి అధికార, విపక్ష పార్టీలు. ప్రతిపక్ష నాయకులు ఆరోపణలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది.
అధికార పార్టీ బీఆర్ఎస్. ఎన్నికల్లో ముందుకు ఎలా వెళ్లాలన్న దానిపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. అదే సమయంలో తెలంగాణ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం.. ఇలాంటి పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. 🚩 తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావడమే టార్గెట్‌గా పావులు కదుపుతోంది బీఆర్ఎస్.. ఇందు కోసం వ్యూహానికి పదును పెడుతూ జోరు పెంచింది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే టార్గెట్‌గా ప్లాన్ చేస్తోంది. ఇలాంటి చాలా అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం తమకు కలిసి వస్తుందని.. ఆర్టీసీ కార్మికుల నుంచి సానుకూల ప్రభావం చూపవచ్చని భావిస్తోంది. 🙏🏻🏛️