తెలంగాణలో ఎన్నికల హడావుడి పెరిగింది. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మరింత వేగం పెంచనుంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితా ప్రకటించి.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీబిజీగా ఉన్నారు బీఆర్‌ఎస్ మంత్రులు.
తెలంగాణలో ఎన్నికల హడావుడి పెరిగింది. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మరింత వేగం పెంచనుంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితా ప్రకటించి.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీబిజీగా ఉన్నారు బీఆర్‌ఎస్ మంత్రులు. దశల వారీగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందిస్తోంది బీఆర్‌ఎస్ ప్రభుత్వం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోగా... చేయాల్సిన పనులు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా వ్యూహరచన చేస్తోంది బీఆర్‌ఎస్. ఎన్నికల బరిలో దిగే క్యాండిడేట్స్‌ను అందరి కంటే ముందుగా ఖరారు చేసింది. ఇప్పుడు మేనిఫెస్టోకు మెరుగులు దిద్దుతోంది. త్వరలోనే మేనిఫెస్టోను విడుదల చేయనుంది బీఆర్‌ఎస్. భారీ బహిరంగ సభ నిర్వహించి... మేనిఫెస్టోను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈనెల 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి... ఆ సభలోనే సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు.
వరంగల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్ని మంత్రి హరీష్‌రావు... ఈనెల 16న వరంగల్ భారీ బహిరంగ సభ జరగబోతోందని చెప్పారు. వరంగల్ సభా వేదికలో సీఎం కేసీఆర్ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పారు. అంతేకాదు శుభవార్త వినడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని కూడా ఆయన సూచించారు. అంతేకాదు... ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయ్యేలా బీఆర్‌ఎస్ మేనిఫెస్టో ఉండబోతుందన్నారు మంత్రి హరీష్‌రావు.