top of page
Shiva YT

ఉత్కంఠ రేపుతున్న ఎగ్జిట్ పోల్స్.. తెలంగాణలోనూ క్యాంపు రాజకీయాలు..?

డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్న తరుణంలో అటు అంచనాలు, ఇటు ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ నడుమ.. తెలంగాణలో కౌన్ బనేగా సీఎం అంటూ జోరుగా బెట్టింగ్ లు కూడా జరుగుతున్నాయి. 👫👥

అందరి చూపు గెలుపు ఎవరన్నది.. అనే దానిపైనే ఉంది.. ఈ క్రమంలో మళ్లీ క్యాంప్ రాజకీయాలు తెరపైకి వస్తాయని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.. 🗣️📰 బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న నేపథ్యంలో.. ఎవరికి వారు మళ్లీ క్యాంప్ రాజకీయాలు చేసే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు. 🤔📊 ఇప్పటికే.. విమానాలు, హోటళ్లు బుక్ అయ్యాయని.. అభ్యర్థులకు అలర్ట్ కూడా వెళ్లినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. 🌐📢 కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ క్యాంపు వ్యవహారాలను చూసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. 🌐📰

దక్షిణాది రాష్ట్రాలకు క్యాంప్ రాజకీయాలు కొత్తేం కాదు.. పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రంలో కొన్నేళ్లుగా సర్వ సాధారణగా మారాయి. 🌏🔄 మొన్నటికి మొన్న బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో కాంగ్రెస్ విజయం సాధించింది. 🗳️🏆 ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించారు. ఈ క్యాంపు రాజకీయం సీఎం అభ్యర్థిని ప్రకటించేంత వరకు ఇదే ఉత్కంఠ కొనసాగింది. 🎙️🔍 గతంలోనూ వైస్రాయ్ హోటల్ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో క్యాంపు పాలిటిక్స్‌కి వేదికయ్యింది. ఎగ్జిట్ పోల్స్ సరళిని చూసిన తర్వాత ఇలాంటి తరహా రాజకీయమే తెలంగాణలో జరుగుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 🤔📊

bottom of page