top of page
Shiva YT

🎬 ప్రాణ స్నేహితుల మధ్య బాక్సాఫీస్ యుద్ధం తప్పదా.? 🎭

🌟 ఏ పనికైనా ముందు చూపు ఉండాలంటారు పెద్దలు..! 🌟 అందుకే మన హీరోలు ఏకంగా ఓ ఏడాది ముందుగానే చూసి పెట్టుకుంటున్నారు రిలీజ్ డేట్లు. 2025 సంక్రాంతికి రావడానికి ఇప్పట్నుంచే సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు. మేం రేసులోనే ఉన్నామంటూ ప్రకటిస్తున్నారు. చూస్తుంటే 2025 సంక్రాంతికి ప్రాణ స్నేహితుల మధ్య బాక్సాఫీస్ యుద్ధం తప్పేలా లేదు.

🎬 మామూలు టైమ్ కంటే.. సంక్రాంతికి వచ్చే సినిమాలకు ఓపెనింగ్స్ మాత్రమే కాదు.. కలెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. అందులోనూ నాగార్జున లాంటి హీరోలైతే సంక్రాంతిని బాగా సెంటిమెంట్‌గానూ ఫీల్ అవుతుంటారు. మొన్న పండక్కి విడుదలైన నా సామిరంగాతో సైలెంట్‌గా వచ్చి హిట్ కొట్టారు నాగ్. అంతేకాదు.. వచ్చే సంక్రాంతికి కలుద్దాం అంటూ హింట్ ఇచ్చారు కూడా.

🗓 వింటున్నారుగా.. వచ్చే సంక్రాంతికి మళ్లీ కలుద్దాం అంటున్నారు నాగార్జున. ప్రస్తుతం ఈయన ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాతో పాటు అనిల్ అనే కొత్త దర్శకుడితోనూ సినిమా చేయబోతున్నారు. అయితే ఈ రెండూ కాకుండా సంక్రాంతి 2025కి బంగార్రాజు 2ను తీసుకురావాలనేది నాగ్ ప్రయత్నం. మరోవైపు విశ్వంభరతో చిరంజీవి ఆల్రెడీ పండగ రేసులో ఉన్నారు.

🔄 రీ ఎంట్రీలో ఖైదీ నెం 150, వాల్తేరు వీరయ్య పండక్కే వచ్చి విజయం సాధించాయి.. దాంతో చిరు కూడా సంక్రాంతిని సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే విశ్వంభరను వచ్చే పండక్కి సిద్ధం చేస్తున్నారు దర్శకుడు వశిష్ట. ప్రాణ స్నేహితుల మధ్య పొంగల్ వార్ ఖాయంగా కనిపిస్తుంది.

🎥 మరోవైపు శతమానం భవతి సీక్వెల్ గా వస్తున్న శతమానం భవతి నెక్స్ట్ పేజ్, హనుమాన్ మూవీ సీక్వెల్ గా జై హనుమాన్ సైతం వచ్చే సంక్రాంతికే రానున్నాయి. వీటి గురించి ఇప్పటికే ప్రకటించేసారు మేకర్స్. 🎉

bottom of page