top of page

బాక్సాఫీస్ వద్ద కల్కి ఊచకోత..


నిన్న ఒక్కరోజే కల్కి సినిమాకు తెలుగు నుంచి రూ.5.4 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే తమిళం, మలయాళం, కన్నడ, భాషల నుంచి భారీగానే కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. విడుదలైన 9 రోజుల్లోనే ఇండియాలో రూ.431.55 కోట్లు వసూలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నారు. ఇందులో తెలుగులో 24.1 కోట్లు, హిందీ నుంచి రూ.171.9 కోట్లు, కన్నడ నుంచి 3 కోట్లు, మలయాళం నుంచి 14.9 కోట్లుగా ఉన్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల కలెక్షన్స్ రూ.800 కోట్లు వచ్చినట్లుగా చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఆ తరువాతి టార్గెట్ రూ.1300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, రెండో స్థానంలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ అవుతుంది. దీనిని కూడా దాటేయడం ‘కల్కి’కి పెద్ద కష్టమేమి కాదు. ప్రస్తుతం ‘కల్కి’ జోరు చూస్తుంటే.. రెండు వారాలు పూర్తయ్యే సరికి రూ.1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది. ఇక శని, ఆదివారాలు వీకెండ్స్ లో కల్కి కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. ఆ దెబ్బకి.. మూడు వారాల్లోనే ‘ఆర్ఆర్ఆర్’ లైఫ్ టైం కలెక్షన్స్ ని ‘కల్కి’ దాటే అవకాశముంది. అదే జరిగితే, తెలుగు సినిమాల పరంగా రూ.1800 కోట్ల గ్రాస్ తో ‘బాహుబలి-2’ టాప్ లో ఉండగా.. రూ.1400 కోట్లకు పైగా గ్రాస్ తో ‘కల్కి’ సెకండ్ ప్లేస్ లోకి వస్తుంది. ఇక ఇండియన్ సినిమాల పరంగా చూస్తే.. మొదటి రెండు స్థానాల్లో ‘దంగల్’, ‘బాహుబలి-2’ ఉండగా.. ‘కల్కి’ మూడో స్థానంలో నిలుస్తుంది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page