టైటాన్ సబ్ మెర్సిబుల్ ప్రమాదంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో ఓషన్ గేట్ సంస్థ వ్యవహరిస్తున్న తీరు షాకింగ్ గా ఉంది. ప్రమాదం జరిగి 10 రోజులు గడవకముందే టైటానిక్ శిథిలాల యాత్ర కోసం బుక్ చేసుకోమంటూ ఓషన్ గేట్ సంస్థ తన
అట్లాంటిక్ సముద్రంలో మునిగపోయిన టైటానిక్ శిథిలాలను(Titanic shipwreck) చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో ఈ నెల 18న కెనడాలోని న్యూఫౌండ్ ల్యాండ్ నుంచి వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్(Titan submesible) సముద్రంలో పేలిపోయిన విషయం తెలిసిందే. ఓషన్ గేట్ సంస్థ(Oceangate)చేపట్టిన ఈ యాత్రలో ఆ సబ్ మెర్సిబుల్ వాహనంలో ప్రయాణంచిన ఐదుగురు మరణించారు. ఈ యాత్రలో దురదృష్టవశాత్తూ పాకిస్తాన్ కు చెందిన బిలియనీర్ షెహ్ జాద్ దావూద్, అతని కుమారుడు సులేమాన్, బ్రిటిష్ సంపన్నుడు హమీష్ హార్డింగ్, ఓషియన్ గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్, రీసెర్చర్ పాల్ హెన్రీ మరణించారు. సముద్రంలో పేలిపోయిన ఆ సబ్ మెర్సి దాని శకలాలను తాజాగా బయటకు తీశారు. కెనడాకు తూర్పున ఉన్న ఈ ప్రావిన్స్ కి 700 కిలోమీటర్ల దూరంలో రిమోట్ తో ఆపరేట్ చేసే "ది హారిజాన్ ఆర్క్ టిక్" అనే వెహికల్ సాయంతో శకలాలను బయటకు తెచ్చారు. తమ టీమ్ విజయవంతంగా ఈ ఆపరేషన్ ని పూర్తి చేసిందని అమెరికాకు చెందిన పెలాజిక్ రీసెర్చ్ సర్వీసెస్ సంస్థ వెల్లడించింది. తదుపరి పరిశీలన కోసం టైటాన్ భాగాలను అమెరికాలోని ఒక పోర్టుకు తరలిస్తున్నారు. వీటిని అధ్యయనం చేస్తే టైటాన్ ప్రమాదం ఎలా జరిగిందో తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సముద్ర గర్బం నుంచి శ్రమకోర్చి బయటకు తీసిన ఈ మినీ టైటాన్ శిథిలాల్లో మానవ అవశేషాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నట్టు యుఎస్ కోస్తా తీర రక్షణ దళం తెలిపింది.అయితే ఈ టైటాన్ సబ్ మెర్సిబుల్ ప్రమాదంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో ఓషన్ గేట్ సంస్థ వ్యవహరిస్తున్న తీరు షాకింగ్ గా ఉంది. ప్రమాదం జరిగి 10 రోజులు గడవకముందే టైటానిక్ శిథిలాల యాత్ర కోసం బుక్ చేసుకోమంటూ ఓషన్ గేట్ సంస్థ తన వెబ్‌సైట్‌లో ప్రకటనలు చేస్తోంది. బ్రిటీష్ ఆన్‌లైన్ వార్తాపత్రిక 'ఇండిపెండెంట్' నుండి వచ్చిన వార్త ప్రకారం.. టైటానిక్ శిధిలాలు చూసేందుకు వచ్చే ఏడాదికి వెళ్లడానికి 2 ట్రిప్పుల ప్రకటన ఇప్పటికీ కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంది. Oceangate వెబ్‌సైట్ ప్రకారం.. లోతైన సముద్ర అన్వేషణ సంస్థ టైటానిక్‌లో వచ్చే ఏడాది జూన్ 12 నుండి జూన్ 20 వరకు మరియు జూన్ 21 నుండి జూన్ 29 వరకు 250,000 డాలర్లు( భారతీయ కరెన్సీలో రూ.2కోట్లు పైనే) ఖర్చుతో రెండు పర్యటనలను ప్లాన్ చేస్తోంది. ఈ ఛార్జీలో ఒక సబ్‌మెరైన్ డైవ్, ప్రైవేట్ వసతి, అవసరమైన అన్ని శిక్షణ, సాహసయాత్ర పరికరాలు మరియు ఆన్‌బోర్డ్ భోజనం ఉంటాయి. మొదటి రోజు, ప్రయాణీకులు సముద్రతీర పట్టణమైన సెయింట్ జాన్స్‌కు చేరుకుని తమ యాత్ర బృందాన్ని కలుసుకుని ఓడ ఎక్కుతారని కంపెనీ తెలిపింది. ఇది పర్యాటకులను RMS టైటానిక్ శిధిలాల దగ్గరకు తీసుకెళుతుందని ప్రకటనలో తెలిపింది. కంపెనీ తన వెబ్‌సైట్‌లో సబ్‌మెరైన్ పైలట్ పోస్ట్ కోసం ఉద్యోగ ప్రకటన చేసింది. అయితే ఓషన్ గేట్ ప్రకటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిగ్గుపడాలంటూ నెటిజన్లు సంస్థ తీరుపై కామెంట్స్ చేస్తున్నారు.ఇక,యుఎస్ కోస్ట్ గార్డ్ ప్రకారం, నిపుణులు ఇటీవల టైటాన్ జలాంతర్గామి శిధిలాల నుండి కొన్ని అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి మానవ అవశేషాలు కావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకునేందుకు ఇంకా చాలా అధ్యయనం చేయాల్సి ఉందని మెరైన్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారి కెప్టెన్ జాసన్ న్యూబాయెర్ తెలిపారు. ఏం జరిగిందన్నది తెలిస్తే మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసేందుకు వీలుంటుందన్నారు.