top of page
Suresh D

మొదటి సినిమాకు వీధుల్లో పోస్టర్స్ పంచిన హీరో.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు..🎥✨

చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాల్లో నటించి.. ఆ తర్వాత హీరోగా మారిన నటుల గురించి చెప్పక్కర్లేదు. అందులో ఈ కుర్రాడు ఒకరు. ఒకప్పుడు చిన్న వయసులోనే తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ చిన్నోడు.. ఇప్పుడు హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు.

చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాల్లో నటించి.. ఆ తర్వాత హీరోగా మారిన నటుల గురించి చెప్పక్కర్లేదు. అందులో ఈ కుర్రాడు ఒకరు. ఒకప్పుడు చిన్న వయసులోనే తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ చిన్నోడు.. ఇప్పుడు హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన నటనతో మెప్పిస్తున్నాడు. పైన ఫోటోను గమనించారా ?.. ఆ చిన్నోడు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో. అతడి తండ్రి ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్. ఈరోజుతో ఆయన 59వ సంతవ్సరంలోకి అడుగుపెడుతున్నాడు. మార్చి 14న పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ హీరోకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సినీ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి నటుడిగా అడుగుపెట్టినా.. ఎన్నో అవమానాలను ఎదుర్కొని స్టార్ డమ్ అందుకున్నాడు. తొలి నాళ్లలో తన సినిమాకు పోస్టర్స్ స్వయంగా వీధుల్లో పంచాడు. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా ?.. అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్.

1973లో వచ్చిన ‘యాదోంకీ బారాత్’ సినిమాలో బాలనటుడిగా నటించాడు అమీర్ ఖాన్. ఆ తర్వాత 1988లో హీరోగా ‘ఖయామత్ సే ఖాయమత తక్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇందులో జుహీ చావ్లా కథానాయికగా నటించింది. ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఫస్ట్ సినిమా తర్వాత అమీర్ ఖాన్ వెనుదిరిగి చూసుకోలేదు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు అగ్ర కథానాయకుడిగా బీటౌన్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. రాఖ్, దిల్, రాజా హిందుస్తానీ, సర్ఫరోష్ వంటి చిత్రాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. గజిని, త్రీ ఇడియట్స్, ధూమ్ 3, పీకే చిత్రాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నాడు. కానీ మీకు తెలుసా.. తొలి సినిమాకు స్వయంగా తన్నే ప్రచారం చేసుకున్నాడు.

అమీర్ ఖాన్ ఫస్ట్ మూవీ ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ కొన్ని కారణాలతో ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది.  ఈ సినిమాలో తన నటన తనకే నచ్చలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో అన్నారు అమీర్. ఈ సినిమా విడుదల సమయంలో నటి జూహీ చావ్లాతో కలిసి సినిమా పోస్టర్లను ఆటోలకు, రిక్షా పుల్లర్ లకు పంపిణీ చేశారు. ఈ సినిమా పోస్టర్లను తమ ఆటోలకు, రిక్షాలకు అతికించాలని కోరాడు. ఆ తర్వాత వీధుల్లో తమ సినిమా పోస్టర్స్ పంచారు. ఇలా ప్రమోషన్స్ చేయడంతో అప్పట్లో ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. 29 ఏప్రిల్ 1988న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. 🎥✨

bottom of page