బీటౌన్‌లో టాలెంట్ (talent) ఉన్న వారికి ఎలాంటి గుర్తింపూ లభించదని.. అలాంటి వ్యక్తుల్ని గుర్తిస్తే వారి కెరీర్‌ను కూడా నాశనం చేస్తారని ఆరోపించారు. ‘నిజాయితీగా చెప్పాలంటే నాదృష్టిలో బాలీవుడ్ చాలా నిస్సహాయ ప్రదేశం. ఇక్కడ ప్రోత్సహించే వారు ఉండరు. కొందరు ప్రముఖ వ్యక్తులు మనకు ఎలాంటి సాయం చేయరు. వారు మనకున్న ప్రతిభను చూసి అసూయపడతారు. టాలెంట్ ఉన్న వ్యక్తులను చూస్తే వారి కెరీర్‌ను నాశనం చేయాలని చూస్తారు. పీఆర్‌లను నియమించి వారి పరువు పోయేలా ప్రచారం చేయిస్తారు. ఇండస్ట్రీ నుంచి వారిని బహిష్కరించేలా పరిస్థితుల్ని సృష్టిస్తారు. నేనూ ఇక్కడ అదేవిధమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నా’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తన వరకూ తాను మంచి వ్యక్తినని కంగన చెప్పుకొచ్చారు. తోటి వారితో మర్యాదపూర్వకంగా నడుకుంటానని చెప్పారు. అలాగే ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించినట్లు గుర్తు చేశారు. ఇండస్ట్రీ నుంచి ఎంతో ప్రేమాభిమానం పొందినట్లు చెప్పారు. ఇదంతా చూస్తే తనతో కొంతమందికి మాత్రమే సమస్య ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. ఆ సమస్య తనలో ఉందా..? లేక వారిలో ఉందా..? అనేది వారు కూడా ఆలోచిస్తే మంచిదంటూ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే కంగనారనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఎమర్జెన్సీ (Emergency). స్వీయ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గతేడాది నవంబరు 24న విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 14న విడుదల చేయానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇంతలోనే కంగనా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం హిమచల్ ప్రదేశ్ ‘మండి’ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటి చేసి గెలవడంతో రాజకీయల్లో బిజీ అయ్యి ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది.
ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. ఈ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహిమా చౌదరి, మిలింద్ సోమన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.