top of page
Shiva YT

ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ తట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు..

మా హీరో వస్తాడు 1000 కోట్లు కొడతాడు..! అరేయ్ మీ వాడి వల్ల ఏమవుతుందిరా మా వాడొచ్చి కొడతాడు చూడు..! ఇవన్నీ చూసాక హీరోల ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా..? మరీ ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాంరా అని..! టాలీవుడ్‌లో కొందరు హీరోల పరిస్థితి ఇదే. వాళ్ల సినిమాలకు 1000 కోట్లు రాకపోతే పరువు పోతుందేమో అనే భ్రమల్లోకి బలవంతంగా పంపించేస్తున్నారు. మరి ఎవరా హీరోలు..? ఏంటా సినిమాలు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

బాహుబలి 2 సినిమాకు 1800 కోట్లు వచ్చినపుడు ఏదో ఒక్క సినిమాకు అలా కనెక్ట్ అయ్యారు కాబట్టి వచ్చాయిలే అనుకున్నారంతా. అనుకున్నట్లుగానే ఆ తర్వాత 1000 కోట్ల సినిమా రావడానికి మూడేళ్లకు పైగానే టైమ్ పట్టింది. మళ్లీ కేజియఫ్ 2తో యశ్.. ట్రిపుల్ ఆర్‌తో రాజమౌళి మరోసారి 1000 కోట్ల మార్క్ అందుకుని ఔరా అనిపించారు. బాలీవుడ్‌కు అందని ద్రాక్షలా ఉన్న 1000 కోట్ల మార్క్‌ను 2023లో పఠాన్‌తో అందుకుని చరిత్ర సృష్టించారు షారుక్ ఖాన్. దాంతో ఇప్పుడు ప్రతీ పెద్ద సినిమాకు 1000 కోట్లు అనేది కామన్ టార్గెట్ అయిపోయింది. పాన్ ఇండియా మార్కెట్ ఉందిగా.. పైగా ఓవర్సీస్ కూడా ఉంది.. మరింకేంటి 1000 కోట్లు వచ్చేస్తాయిలే అంటున్నారంతా. ఈ ప్రెజర్ ఎక్కువగా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌పైనే పడుతుంది.ఇండియాలో నెక్ట్స్ 1000 కోట్ల సినిమా ఏదంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుందిప్పుడు. దీనికి సమాధానం అంతా పుష్ప 2 అంటున్నారు. ఈ చిత్రంపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. పైగా మొదటి భాగం 350 కోట్లు వసూలు చేయడంతో.. పార్ట్ 2 కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఏడాది కూడా 1000 కోట్ల ఒత్తిడి ఫేస్ చేస్తున్న సినిమాలున్నాయి.. అవే జవాన్, సలార్, ఆదిపురుష్.

ప్రభాస్ సినిమా వస్తుందంటే 1000 కోట్లకు తగ్గేదే లే అంటున్నారు ఫ్యాన్స్. అందుకే మొన్న ఆదిపురుష్ ట్రైలర్ లాంఛ్‌లో 2000 కోట్లు కలెక్ట్ చేయాలన్నారు ప్రభాస్. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌పైనా ఇదే ఒత్తిడి కనిపిస్తుంది. దర్శకుడు శంకర్ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇక సలార్ కన్ఫర్మ్ 1000 కోట్ల బొమ్మ అని ఫిక్సైపోయారు అభిమానులు. కానీ అవి 1000 కోట్లు బాసూ.. మాటల్లో చెప్పినంత ఈజీ కాదు.


bottom of page