బ్లాక్ వాటర్ ప్రయోజనాలు సాధారణ మనం తాగే మంచినీళ్లలో ph స్థాయి 7 ఉంటే.. ఈ బ్లాక్ వాటర్‌లో అంతకుమించి ఉంటుందట. అలానే బాడీని హైడ్రేటెడ్, ఫిట్‌గా ఉంచటంలో ఈ బ్లాక్ వాటర్ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే 70% ఖనిజాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణప్రక్రియని మెరుగుపరుస్తుంది. శరీరానికి సరిపడా ఈ నీరు తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, జీర్ణశయాంతర ప్రేగు సమస్యలను నివారిస్తుంది. 🌊💪🌞
బ్లాక్ వాటర్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం పొడిబారకుండా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఈ బ్లాక్ వాటర్ సహాయపడుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నీరు ఏకాగ్రతను పెంచుతుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. 🌊🧖♂️🤗
వేసవిలో ఈ నీటిని ఎక్కువగా తీసుకుంటే.. సన్‌స్ట్రోక్ నుంచి బయటపడవచ్చు. బ్లాక్ వాటర్ శరీర వేడిని తగ్గిస్తుంది. బ్లాక్ వాటర్ రక్తపోటును అదుపులో ఉంచడం, కీళ్లలో జిగురు పెంచడంలోనూ శరీర కీలకమైన విధుల్లో పాల్గొంటుంది. జీవక్రియ, నాడీ సంబంధిత విధులను మారుస్తుంది. 💨🩸🧘♂️
మనం రోజూ తీసుకునే నీటిలో సాధారణంగా అకర్బన లవణాలు ఉంటాయి. అయితే బ్లాక్ వాటర్ లో నీరు ఎక్కువ ఆల్కలీన్‌గా ఉంటుంది. అందువల్ల బ్లాక్ వాటర్‌ని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. 👩⚕️🤔🌊