top of page
MediaFx

విమానంలోలాగే రైలులో కూడా ‘బ్లాక్‌ బాక్స్‌’..


ప్రతి విమానం లోపల బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఆ విమానం ఆపరేషన్‌కు సంబంధించిన అనేక ముఖ్యమైన సమాచారం అందులో రికార్డ్‌ అయి ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు విమానానికి ఏమి జరిగిందనే దాని గురించి బ్లాక్ బాక్స్ మాత్రమే ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తుంది. భారతీయ రైల్వే కూడా అదే సాంకేతికతను అవలంబిస్తోంది. రైళ్లలో రైల్వే క్రూ వాయిస్ వీడియో రికార్డింగ్ సిస్టమ్ (సీవీవీఆర్‌ఎస్)ను ఏర్పాటు చేస్తున్నారు. అంటే రైలు ఇంజన్లలో కూడా బ్లాక్ బాక్స్‌లను అమర్చుతున్నారు. రైలు ఇంజిన్‌లో అమర్చిన ఈ పరికరం ప్రమాదానికి ముందు జరిగే పొరపాట్లు, రూట్‌కు సంబంధించిన లోపాల గురించి లోకో పైలట్‌లకు తెలియజేస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసి త్వరలో అమలు చేసేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. రైళ్లలో ఈ బ్లాక్‌బాక్స్‌ని అప్‌గ్రేడ్ చేయడం వల్ల ప్రమాదాలు తగ్గడమే కాకుండా ప్రయాణీకుల భద్రతను కూడా పెంచేందుకు దోహదపడుతుంది.

Comments


bottom of page