top of page

🔵 చతుర్ముఖ వ్యూహంతో తెలంగాణ బీజేపీ దూకుడు..

🔷 చతుర్ముఖ వ్యూహంతో సిద్ధంగా ఉంది బీజేపీ. ఇప్పటికే అధ్యక్షుడి మార్పుతో దూకుడు పెంచేసింది. ఈ నెల 27న ఖమ్మం జిల్లాలో జరిగే అమిత్ షా సభతో గేర్ మార్చాలని డిసైడైంది.

తర్వాత ఈనెల 23న చేవెళ్లలో, 24న స్టేషన్ ఘన్ పూర్‌లో సభలకు ప్లాన్ చేసింది బీజేపీ. ఇప్పటికే ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన బీజేపీ.. ప్రత్యేక వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. కాగా.. అమిత్ షా సభతో బీజేపీ ఎన్నికల సమరశంఖారావం పూరించనుంది. ఖమ్మం వేదికగా అమిత్ షా పలు కీలక ప్రకటనలు సైతం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

🛤️ తెలంగాణ టూర్‌లో బీజేపి ఎమ్మెల్యేలు.. సెప్టెంబర్ రెండో వారంలో..

🗳️ బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.. అభ్యర్థుల ఎంపికలో వీళ్లిచ్చే రిపోర్టులు కూడా కీలకం కాబోతున్నాయట. ఇప్పటికే సీనియర్లంతా అసెంబ్లీలకు పోటీ చేయాలని అధిష్టానం నుంచి ఆదేశాలొచ్చేశాయ్. నెలాఖర్లోగా తొలి జాబితా ప్రకటించి.. నేతల్లో కాన్ఫిడెన్స్ పెంచాలని కమలనాథుల ఆలోచించారు. అయితే, సెప్టెంబర్ రెండో వారంలో తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందని టీబీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. 🚀

Comments


bottom of page