🏛️ అసెంబ్లీ ఎన్నికల వాతావరణంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. 🗳️ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రక్రియలో స్పీడ్ పెంచాయి. 🏃♂️
ప్రధానంగా.. తెలంగాణలో కమలం పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. 👥 కేసీఆర్ సర్కార్‌ను ఢీకొట్టి.. ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. 🌟 ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి వ్యూహ రచనలు సిద్ధం చేసింది. 📊 ఇప్పటికే.. సునీల్ బన్సల్ నేతృత్వంలో బీజేపీ వ్యూహలను రచిస్తోంది. 🧩 ఈ క్రమంలోనే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల నుంచి ధరఖాస్తులు స్వీకరించారు బీజేపీ నేతలు. 🔐 దీంతో తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్‌లకు భారీ పోటీ నెలకొంది. 💼 వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసేవారి దరఖాస్తులు పోటెత్తాయి. 🔥 ఆశావహులు నుంచి గత వారం రోజులుగా బీజేపీ దరఖాస్తుల స్వీకరణ చేపట్టగా.. నిన్నటితో అప్లికేషన్స్‌కు గడువు ముగిసింది. 📆 అయితే.. ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆశావహులు భారీగా పోటీ పడ్డారు. 🙌 119 సీట్లకు 6వేలకు పైగా దరఖాస్తులు రావడం ఆసక్తి రేపుతోంది. 🗳️👥🔥