top of page
Shiva YT

"తెలంగాణలోని ఆ ఉమ్మడి జిల్లాపై బీజేపీ స్పెషల్ ఫోకస్..🌟

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. బీజేపీకి మంచి పట్టు ఉంది. ఈ జిల్లాలో ఒక ఎంపీ బండి సంజయ్ కుమార్‌తో పాటు ఎమ్మెల్యే ఉన్నారు. 🏞️

అయితే.. తెలంగాణలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కీలక నేతలు ఇక్కడి నుంచే బరిలోకి దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 📢 బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. కరీంనగర్ నుంచీ బరిలోకి దిగనున్నారు. 🚀 అదే విధంగా బీజేపీ తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హుజురాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. 📋 అదే విధంగా.. అరవింద్ కోరుట్ల నుంచీ బరిలో ఉండమన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్: జిల్లాలో13 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. బీఆర్ఎస్ 12 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 🗳️ కాంగ్రెస్ ఒక్క స్థనంలో గెలిచింది. 🎊 తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో హుజురాబాద్‌లో బీజేపీ విజయం సాధించింది. 🏆 ప్రస్తుతం బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 1, బీజేపీ 1 స్థానాల్లో ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 🎤 అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అనుహ్యంగా భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా మోగించింది. 🗺️ కరీంనగర్ పార్లెమెంటు నియోజకవర్గంలో బీజేపీ తరుఫున బండి సంజయ్ కుమార్ విజయం సాధించారు. 🌆 ఎంపీ పార్లమెంటు పరిధిలో కరీంనగర్, మానకొండూరు, వేములవాడ, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. 📊"

bottom of page