top of page

బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా..

బండి సంజయ్ కుమార్ రాజీనామా చేశారు. పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను భారతీయ జనతా పార్టీ హైకమాండ్ మార్చనుందన్న నేపథ్యంలో బండి సంజయ్ రాజీనామా చేశారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవికి బండి సంజయ్ కుమార్ రాజీనామా చేశారు. పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను భారతీయ జనతా పార్టీ హైకమాండ్ మార్చనుందన్న నేపథ్యంలో బండి సంజయ్ రాజీనామా చేశారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం బండి సంజయ్ రాజీనామా లేఖను హైకమాండ్ కు అందించారు.కాగా.. బీజేపీ అధిష్టానం తెలుగు రాష్ట్రాలతోపాటు.. పలు రాష్ట్రాల్లో నాయకత్వ మార్పులు చేసింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రకటించింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని ప్రకటించింది..

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page