🇮🇳భారతదేశంలో డిజిటలైజషన్ ఒక సరికొత్త మార్పు.. అన్ని రంగాలను డిజిటలైజషన్ చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే నడుంబిగించి ప్రపంచంలోనే అగ్రగ్రామిగా దూసుకెళ్తోంది.
2015 డిజిటల్ ఇండియా నినాదంతో ప్రధాని మోడీ.. అన్నిరంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చారు. డిజిటలైజేషన్‌లో భాగంగా అన్ని రంగాలను ఒకేతాటిపైకి తీసుకువచ్చి.. మరింత సులువుగా పనులు జరిగేలా.. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, వ్యాపార రంగాలను అనుసంధానం చేశారు. ఇప్పడు భారత బ్యాంకింగ్ వ్యవస్థ డిజిటలైజేషన్ లో అగ్రగ్రామిగా ఉందంటే.. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే.. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చారు. భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ రోజురోజుకు వేగంగా పుంజుకుంటోంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 70 మిలియన్ల మందికి నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, చెల్లింపులు, యుటిలిటీ చెల్లింపులు వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. దేశం తన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడంలో అగ్రగామిగా ఉంది. కావున ప్రభుత్వ రంగం, వ్యాపారాలు దేశంలో ఎక్కడి నుంచైనా అందుబాటులో ఉండే సురక్షితమైన, తక్షణ పేపర్‌లెస్, నగదు రహిత సేవలను అందిస్తోంది. ప్రజలు డిజిటల్ బ్యాంకింగ్‌ను సులువుగా యాక్సెస్ చేసేలా ప్రభుత్వం పలు చర్యలు కూడా తీసుకుంది. డిజిటలైజేషన్ తో అన్ని రంగాల సమ్మిళిత ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశగా భారత్ పయనిస్తున్నందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం డిజిటలైజేషన్ కోసం తీసుకుంటున్న చర్యలకు ఉదాహరణగా.. ఇక్కడి పరిస్థితి ఉదహరణగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికర పోస్ట్ ను పంచుకున్నారు. భారత పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ భారతీయ పోస్టల్ ఉద్యోగిని ప్రశంసించండంతోపాటు.. ఫోటోను పంచుకున్నారు. 📸👍