top of page
Suresh D

బాక్సాఫీస్ బద్దలయ్యే న్యూస్.. రీరిలీజ్ కాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీ🎥✨

బాలయ్య అంటే మాస్.. మాస్ అంటే బాలయ్య.. నందమూరి బాలకృష్ణ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

సినిమా ఏదైనా సరే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయాల్సిందే. ఇక బాలయ్య, బోయపాటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కాంబో తలుచుకుంటనే రికార్డులు గుర్తుకువస్తాయి. మరోసారి ఆ కాంబోలో వచ్చిన మూవీ ఒకటి రిరిలీజ్ కాబోతోంది. ఇది నిజంగా బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.ఇప్పటివరకు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్స్ లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో ఒకటి. సింహా మొదటి సినిమా కాగా, లెజెండ్ రెండో సినిమా, వీరిద్దరూ అఖండ మూవీతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు. అయితే వీరిద్దరూ మరోసారి మరో సినిమా కోసం జతకట్టనున్నారనే విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే లెజెండ్ సినిమా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీరిలీజ్ చేయనున్నారు మేకర్స్. లెజెండ్ 2014 మార్చి 28న విడుదలైంది. మార్చి 30న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.🎥✨

Related Posts

See All

‘తలైవా 171’ గురించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన లోకేశ్‌ కనగరాజ్‌ 🎬

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) జైల‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేసుకుంటూపోతున్నాడు.

bottom of page