top of page

ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ బిగ్ ప్లాన్..

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ (Congress Party) స్పీడ్ పెంచింది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఆ దిశగా పావులు కదుపుతుంది. ఇప్పటికే కీలక నేతలను పార్టీ చేర్చుకోగా వారికి కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. తాజాగా ఓ ఇద్దరు కీలక నేతలతో సహా పలువురికి అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది.

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీ మధుయాష్కీని (Madhuyashki Goud) నియమించిన అధిష్టానం ఇటీవల పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Ponguleti Srinivas Reddy) కో చైర్మన్ బాధ్యతలను అప్పగించింది. అలాగే కన్వీనర్ గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీని నియమించింది. వీరితో పాటు మరో 37 మందితో కూసిన ఎగ్జిక్యూటివ్ కమిటీ, పీసీసీ అధ్యక్షుడితో పాటు సీఎల్పీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జాతీయ ఆఫీస్ బేరర్లు, అలాగే పలు శాఖలు, డీసీసీ అధ్యక్షులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏఐసీసీ (AICC) ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు లోక్ సభ నియోజకవర్గాల వారీగా 17 మంది ఏఐసీసీ (AICC) పరిశీలకులను అధిష్టానం నియమించింది. వీరి నియామక ప్రతిపాదనను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం కూడా తెలిపినట్టు కెసి వేణుగోపాల్ (Kc Venugopal) స్పష్టం చేశారు. కాగా తెలంగాణలో డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హస్తం పార్టీ నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి కాంగ్రెస్ (Congress) ను తీసుకెళ్లాలనే గట్టి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందని ఆలోచించకుండా సోనియాగాంధీ (Soniyagandhi) ఆలోచించలేదని భావనను ప్రజల్లో కల్పించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు పార్టీకి ఏ మేర కలిసొస్తాయి? ఈసారి ప్రజలు హస్తం పార్టీకి పట్టం కట్టబెడతారా? లేదా? మరోసారి అధికార బీఆర్ఎస్ కే అవకాశం ఇస్తారా అనేది చూడాలి.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page