top of page
Suresh D

సురేఖాతో అమర్‌దీప్ రిలేషన్ అందుకే ఆమె కూతురితో సినిమా చేశాడా.


టాలీవుడ్ నటి సురేఖా వాణి ఎన్నో చిత్రాల్లో క్యా రెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పిం చిం ది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమైంది. అడపా దడపా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అం తేకాకుం డా సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉం టుం ది. అయితే సురేఖా వాణి కూతురు సుప్రిత హీరోయిన్‌గా ఇటీవల సినీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో హీరోగా బిగ్‌బాస్ అమర్ దీప్ చౌదరి నటిస్తున్నా డు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తవడంతో.. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా, అమర్ దీప్, సుప్రితతో కలిసి రీతూ చౌదరి హోస్ట్ చేస్తున్న దావత్ షోకు హాజరయ్యారు.

ఈ షోలో భాగంగా అమర్ దీప్ తనకు సురేఖా వాణికి మధ్య ఉన్న రిలేషన్‌ గురిం చి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. సురేఖా వాణి మా బంధువులు అవుతారు. ఆమె నాకు అక్క అవుతుంది. సుప్రిత కోడలు అని చెప్పడం తో రీతూ షాక్ అయిపోతుంది. ఆ తర్వా త అమర్ దీప్‌ను మావయ్యా అని పిలవమని సుప్రితకు చెప్తుం ది..అప్పుడు ఆమె చాలా క్యూట్‌గా మావయ్యా అనేస్తుంది. దీంతో అమర్ సిగ్గు పడిపోయాడు. ఆ తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘సుప్రితతో చేయడానికి కారణం నేను చేయబోతున్న కథకు ఆమె కరెక్ట్‌గా సెట్ అవుతుంది. అందుకే సుప్రీత హీరోయిన్ అనగానే ఓకే చేశాను’’ అంటే అమర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

bottom of page