top of page
MediaFx

బిగ్ బాస్ సీజన్ 8కు రంగం సిద్ధం.. హౌస్‌లోకి వెళ్లే వారిలో ఊహించని పేర్లు

తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న గేమ్ షోస్ లో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటికే ఏడూ సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఎనిమిదో సీజన్ కు రెడీ అవుతోంది. మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. తర్వాత సీజన్స్‌కి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు సీజన్ 8 కోసం కూడా రంగం సిద్ధమైంది.

సీజన్ 7 విజయవంతం

సీజన్ 7లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఇప్పుడు సీజన్ 8 కోసం రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ లో ప్రారంభం కానున్న సీజన్ 8లో పాల్గొనే వాళ్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది పేర్లు దాదాపు కన్ఫర్మ్ అని గుసగుసలాడుకుంటున్నారు.

సీజన్ 8లో పాల్గొనబోయే వారెవరో?

బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొనబోయే వాళ్ల లిస్ట్:

  1. యూట్యూబర్ బంచిక్ బబ్లూ

  2. హీరో రాజ్ తరుణ్

  3. యూట్యూబర్ సోనియా సింగ్

  4. నటి హేమ

  5. నేత్ర

  6. వంశీ

  7. రీతూ చౌదరి

  8. సురేఖ వాణి (లేదా ఆమె కూతురు సుప్రీత)

  9. కిరాక్ ఆర్పీ

  10. కుమారి ఆంటీ

  11. బర్రెలక్క

  12. కుషిత కొల్లపు

  13. బుల్లెట్ భాస్కర్

  14. చమ్మక్ చంద్ర

  15. అమృత ప్రణయ్

ఇవి కాక మరికొంతమంది కూడా ఉండవచ్చని తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో ఎంతమంది ఫైనల్‌గా ఉంటారో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే.

bottom of page