top of page

ఊహించని కంటెస్టెంట్స్​తో బిగ్​బాస్ ఫైనల్ లిస్ట్..!


సాధారణంగా బిగ్​బాస్​లోకి వెళ్లే కంటెస్టెంట్స్​ చాలా మంది ప్రజలకు తెలిసిన వారే ఉంటారు. ముఖ్యంగా​ సీరియల్ యాక్టర్స్, హీరోహీరోయిన్స్, యాంకర్స్, సోషల్ మీడియా స్టార్స్, సింగర్స్​, డ్యాన్సర్స్​, మోడల్స్ ఇలా చాలా మంది ప్రజలకు పరిచయం ఉన్నవారే హౌజ్​లోకి ఎంటర్​ అవుతుంటారు. ఈ సీజన్​లో కూడా ఈ విభాగాలకు చెందిన వారే ఉన్నారు. బిగ్​బాస్​లో పాల్గొనేది వీళ్లే అంటూ ఇప్పటికే చాలా మంది పేర్లు నెట్టింట చక్కర్లు కొట్టాయి. తాజాగా సీజన్​ 8లో హౌజ్​లోకి అడుగుపెట్టేందుకు కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని.. వారంతా హౌజ్​లోకి ఎంట్రీ కోసం సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సీజన్​లో మొత్తం 19 మంది పాల్గొంటారని.. ముందుగా 14 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఇది వరకు నెట్టింట వినిపించిన పేర్లు కాకుండా ఇప్పుడు మరికొంత మంది కొత్త సెలబ్రెటీల పేర్లు తెరపైకి వచ్చాయి.

ఫైనల్​ అయిన 14 మంది వీళ్లే అంటూ ప్రచారం:

విష్ణుప్రియ భీమినేని

శేఖర్ బాషా

బెజవాడ బేబక్క

నైనికా

విస్మయ శ్రీ

ఆదిత్య ఓం

మోడల్ రవితేజ

దర్శకుడు పరమేశ్వర్

ఖయ్యూమ్ అలీ

సౌమ్యరావు

గాయకుడు సాకేత్

అంజలి పవన్

అభినవ్ నవీన్

అభిరామ్ వర్మ

వైల్డ్​ కార్డ్​ ద్వారా మరో ముగ్గురు: ఈ 14 మంది దాదాపు నూటికి నూరు శాతం బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి వెళ్లే ఫైనల్ కంటెస్టెంట్స్ అని పక్కా సమాచారం. వీరితోపాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జబర్దస్త్ రీతూ చౌదరి, సీరియల్​ ఫేమ్ ఇంద్రనీల్ వర్మ, రాకింగ్​ రాకేష్​ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. అయితే, వీరిని షో ప్రారంభం అయిన రెండో వారం, లేదా మూడో వారం హౌజ్‌లోకి పంపించనున్నారట. మాజీలు ఇద్దరు: ఈ 17 మందితోపాటు బిగ్​బాస్ తెలుగు 8లోకి మాజీలు కూడా రాబోతున్నట్లు టాక్​ వినిపిస్తోంది. వారిలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కంటెస్టెంట్స్ హరితేజ, ఆదర్శ్‌ను, బీబీ 3 హౌజ్‌మేట్స్ పునర్నవి, వరుణ్ సందేశ్ భార్య వితిక, అలాగే బిగ్ బాస్ తెలుగు 5 సీజన్‌లో పాల్గొన్న సిరి హన్మంతు పేర్లు లిస్ట్​లో ఉన్నాయని సమాచారం. వీళ్లందరిలో ఇద్దరు పాల్గొంటారని టాక్​ వినిపిస్తుంది. అయితే ఇవన్నీ నిజమో కాదో తెలియాలంటే మాత్రం మరో మూడు రోజులు వెయిట్​ చేయక తప్పదు!




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page