top of page

బిగ్ బాస్ హౌస్లో లైంగిక వాంఛ తీర్చుకున్న జంట...


బిగ్ బాస్ షో పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ రియాలిటీ షో బ్యాన్ చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. వయసులో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలను ఒక చోట ఉంచడం, గేమ్స్-టాస్క్స్ పేరుతో ఆడ మగ తేడా లేకుండా పరిగణించడం సరికాదని వారి వాదన. కంటెస్టెంట్స్ ప్రవర్తన, వారి మధ్య అఫైర్స్, కెమెరాల ముందే రొమాన్స్ వంటి చర్యలు మన సంస్కృతిని దెబ్బ తీస్తాయనే ఆందోళను వ్యక్తం అవుతున్నాయి.  బిగ్ బాస్ షో యంగ్ జనరేషన్ ఆలోచన విధానం ప్రభావితం చేస్తుందని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ లేడీ కంటెస్టెంట్ కి బిగ్ బాస్ హౌస్లో గర్భ నిర్ధారణ పరీక్షలు జరిగాయి. అంకిత తన భర్త విక్కీ జైన్ తో పాటు బిగ్ బాస్ సీజన్ 17లో పాల్గొంది. అంకిత స్వల్ప అనారోగ్యానికి గురైంది. సిబ్బంది మెడికల్ రూమ్ కి తీసుకెళ్లి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. ఈ విషయాన్ని భర్త విక్కీ జైన్ తో చెబుతూ ఆమె ఆందోళన చెందింది. ఒకవేళ పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంటని అంకిత భయపడింది. తర్వాత ఆమె రిజల్ట్ నెగిటివ్ వచ్చినట్లు సమాచారం. బిగ్ బాస్ హౌస్ కి వెళుతున్న భార్యాభర్తలు లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నారా? అనే సందేహాలు ఈ పరిణామంతో మొదలయ్యాయి. దీనికి మించిన షాకింగ్ పరిణామం తాజాగా చోటు చేసుకుంది. ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 ప్రారంభమైంది. జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. అర్మాన్ మాలిక్ అనే కంటెస్టెంట్ తన ఇద్దరు భార్యలతో హౌస్లో అడుగుపెట్టడం టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యింది. భార్యాభర్తలు బిగ్ బాస్ హౌస్లో పాల్గొనడం అందరికీ తెలిసిందే. చాలా జంటలు పలు భాషల్లో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లారు. తెలుగులో ఇప్పటి వరకు రెండు జంటలు పాల్గొన్నారు.  కానీ ఇద్దరు భార్యలతో బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడం ఇదే ప్రథమం. అర్మాన్ మాలిక్ భార్యల పేర్లు పాయల్ మాలిక్, కృతిక మాలిక్. వీరిలో పాయల్ మాలిక్ ఎలిమినేట్ అయ్యింది. కృతిక మాలిక్- అర్మాన్ మాలిక్ ఒకే బెడ్ పై పడుకుంటున్నారు. వీరిద్దరూ అర్ధరాత్రి లైంగిక చర్యకు పాల్పడిన వీడియో లీకైంది.  దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది. బిగ్ బాస్ షో పై ఇప్పటికే విపరీతమైన వ్యతిరేకత ఉండగా.. తాజా పరిణామం మరింత నిప్పు రాజేసింది. ఇక నెటిజెన్స్ వీడియో షేర్ చేస్తూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఇది బిగ్ బాస్ హౌసా లేక పర్సనల్ బెడ్ రూమా అని ప్రశ్నిస్తున్నారు... మొత్తంగా అర్మాన్ మాలిక్ అతిపెద్ద వివాదానికి తెరలేపాడు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page