🌧️🌧️ కుండపోత వర్షాలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైంది. చెరువులు, వాగులు, వంకలు జలాశయాలన్నీ నీటితో జలకళను సంతరించుకున్నాయి.
వరద ఉధృతికి చెరువు కట్టలు సైతం తెగిపోయాయి. చాలా ప్రాంతాలు నీటమునిగాయి. దాదాపు 30 మంది వరకు మరణించారు. లోతట్టు ప్రాంతాలు ఇంకా తేరుకునే లేదు.. వరద పరిస్థితులను చూసి జనం తల్లడిల్లుతున్నారు. 🏞️🏞️🏘️ 🚨 ఈ తరుణంలో వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు.. నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. 🚨🚨🌧️ 🌧️🏙️ కాగా.. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టాయనుకున్న క్రమంలో హైదరాబాద్ నగరంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. నగరం అంతటా భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, ఎల్పీ నగర్ సహా శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరో గంటపాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని నగర వాసులు అప్రమత్తంతగా ఉండాలంటూ వాతావరణ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. 🌧️🏘️🚗