top of page

రైతులకు భారీ శుభవార్త...రేషన్ కార్డు లేకపోయిన రుణమాఫీ.. !


తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీ అమలు దిశగా మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే రేషన్ కార్డు నిర్ణయించారు. ప్రతి కుటుంబానికి రూ.2లక్షల రుణమాఫీ అవుతుందని మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. తెలంగాణలోని అన్ని వాణిజ్య, ప్రాంతీయ, సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న వారికి రేషన్ కార్డు ప్రామాణికమన్నారు.

అయితే ఇప్పుడు ఇదే విషయమై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు.. కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ కార్డు లేని రైతులెవరూ ఆందోళన చెందొద్దని వారికి కూడా రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదన్నారు. రేషన్ కార్డు నిబంధన కేవలం కుటుంబ నిర్ధారణ కోసమేనని కార్డు లేనివారి గురించి వ్యక్తిగత విచారణ చేపడతామన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు ? ఎవరి పేరిట రుణం ఉందని వివరాలను పరిశీలించి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వాటి బ్రాంచ్ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం. 2018 డిసెంబర్ 12 తేదీ లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 2023 డిసెంబర్ 9వ తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం, 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2023 డిసెంబర్ 9 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది. రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌరసరఫరాల శాఖ నిర్వహించే ఆహార భద్రత కార్డు (పీడీఎస్) డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది.కానీ ప్రాథమిక వ్యవసాయ, సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది.


కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్రప్రభుత్వం వద్దడేటా లభ్యంగా వున్నంత మేరకు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణనలోనికి తీసుకోనున్నారు.ఈ రుణమాఫీ ఎసెబీ, జేఎల్, ఆర్ఎంజీ, ఎస్ఈసీఎస్లలో తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదు. ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూలు చేసిన రుణాలకు వర్తించదు. కంపెనీలు, ఫర్మ్ లకు, సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు కూడా వర్తించదు.అయితే అంతా బావుందికానీ.. రుణమాఫీ విషయంలో ఇప్పుడు రేషన్ కార్డు ఉండాలా? అవసరం లేదా అనేది మాత్రం సరిగ్గా తేలడం లేదు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో రేషన్ కార్డుయే ప్రామాణికం అంటున్నారు. అటు… మంత్రి తుమ్మల మాత్రం.. రేషన్ కార్డు లేకున్నా కూడా రుణమాఫీ పథకం కింద డబ్బులు ఇస్తామంటున్నారు. దీంతో రైతుల్లో రేషన్ కార్డు విషయమై గందరగోళం నెలకొంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page