top of page

బిగ్ బాస్‌లోకి బోల్డ్ బ్యూటీ..


బిగ్ బాస్ అనే గేమ్ షో దేశంలో పలు భాషల్లో టెలికాస్ట్ అవుతుంది. మిగతా భాషలతో పోల్చుకుంటే బిగ్ బాస్ తెలుగు కాస్త ఆలస్యంగా వచ్చింది. అయినా కూడా బిగ్ బాస్ తెలుగు ఇండియాలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. ఇక ఇప్పటికే ఏడూ సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 8 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీజన్ కూడా ప్రేక్షకులను రెట్టింపు ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొనే వారి పేర్లు సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న పేర్లు ఇవే.. ఇంద్రనీల్, నటి సన, బంచిక్ బబ్లూ, తేజస్విని గౌడ, అంజలి పవన్, అనిల్ గీలా, రీతూ చౌదరి, యాంకర్ వింద్యా, గాయత్రి గుప్తా, పవిత్ర, పొట్టి నరేష్, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్,ఖయూమ్, డ్యాన్సర్ నైనిక, రింగ్ రియాజ్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారని తెలుస్తోంది. వీరితో పాటు ఓ క్రేజీ లేడీ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఆమె కిర్రాక్ సీత. సోషల్ మీడియాలో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి పాపులర్ అయ్యింది సీత. బోల్డ్ కంటెంట్ తో వీడియోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే బేబీ సినిమాలోనూ నటించింది ఈ అమ్మడు. ఇప్పుడు ఈ క్రేజీ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.



Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page