top of page

ఈ వారం బయటకు వెళ్ళేది అతడే.. ఊహించని ఎలిమినేషన్ 🤔

వారాంతం వచ్చిందంటే చాలు హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే చాలా మంది ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు.

దాంతో ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వారం నామినేషన్ లో గౌతమ్, శివాజీ, యావర్, రతికా, బోలే ఉన్నారు. వీరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. ఇప్పటికే శుక్రవారం నాటి రాత్రితో ఓటింగ్ పూర్తయ్యింది. హౌస్ లో ఉన్న వారిలో శివాజీకి ఎక్కువ ఓట్స్ పడ్డాయి. ఇక డేంజర్ జోన్ లో రతికా, బోలే ఉన్నారు.

కానీ ఊహించని విధంగా బోలే ఎలిమినేట్ కానున్నడని తెలుస్తోంది. పాట బిడ్డగా హౌస్ లోకి వచ్చిన బోలే తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే యాక్టివ్ గా ఉంటూ హౌస్ లో ఉన్నవారితో మాట్లాడుతూ నవ్వులు పూయించారు. అయితే హౌస్ లో ఉన్న సీరియల్ బ్యాచ్ మనోడిని టార్గెట్ చేశారు. ప్రియాంక, శోభా శెట్టితో గొడవ పెట్టుకున్నారు బోలే. అలాగే వాళ్ళను ర్యాగింగ్ చేసి ఒక ఆట ఆడుకున్నాడు. కానీ టాస్క్ లలో మాత్రం అంతగా యాక్టివ్ గా ఆడలేదు. అదే అతనికి మైనస్ అయ్యింది. దాంతో ఈసారి ఓటింగ్ కూడా తక్కువగా వచ్చిందని తెలుస్తోంది. 🏠👤🎉

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page