నాగచైతన్య కస్టడీ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ పెద్ద తలనొప్పిగా మారిపోయిందని తెలుస్తోంది. చైతూ గత సినిమాల ఎఫెక్ట్ తో పాటు ఇతర సినిమాల ఎఫెక్ట్ కూడా పడిందని అంటున్నారు.
సాధారణంగా హీరోల చివరి సినిమాల కలెక్షన్స్ బట్టి వారి ప్రస్తుత సినిమాల మార్కెట్ నిర్ణయిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడూ జరిగే ప్రక్రియే, అయితే ఇప్పుడు నాగచైతన్య కస్టడీ సినిమాకి ఇదే పెద్ద తలనొప్పిగా మారిపోయిందని తెలుస్తోంది. నిజానికి ఆయన గత సినిమాలు మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో వచ్చి బోల్తా పడుతున్న ఇతర సినిమాల ఇంపాక్ట్ కూడా ఆయన సినిమా మార్కెట్ మీద పడుతున్నాయని అంటున్నారు.ఈ మధ్యకాలంలో వచ్చిన విరూపాక్ష మినహా మరి ఏ సినిమా హిట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న సినిమాలను కొనుగోలు చేయడానికి కూడా డిస్ట్రిబ్యూటర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాతిక కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగుతుందని నిర్మాతలు భావించారు.దానికి బయ్యర్లు కూడా ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలు బోల్తా పడుతున్న నేపథ్యంలో అంత అయితే తాము పెట్టలేమని చేతులెత్తేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కస్టడీ సినిమాకి పాతిక కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందనుకుంటే అది 18 కోట్లకే ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి తోడు అక్కినేని హీరోల మార్కెట్ కూడా బాలేదని అంటున్నారు.
ఇటీవల అఖిల్ ఏజెంట్ నాగార్జున గోస్ట్ వంటి సినిమాలు నాగచైతన్య చివరిగా నటించిన థాంక్యూ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచిన నేపథ్యంలో వారి మీద అంత డబ్బు పెట్టాలంటే ఇబ్బందిగానే ఉందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. మే 12వ తేదీన కస్టడీ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది.