top of page

భోళా శంకర్ మూవీకి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్..🎥🎞️

భోళా శంకర్ మూవీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే.. వరల్డ్ వైడ్‌గా మొదటి రోజు రూ.30 కోట్ల గ్రాస్, రూ.15 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ గత చిత్రాలతో పోలిస్తే.. ఈ సినిమాకు తక్కువ కలెక్షన్స్ వచ్చాయి.

భోళా శంకర్ మూవీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే.. వరల్డ్ వైడ్‌గా మొదటి రోజు రూ.30 కోట్ల గ్రాస్, రూ.15 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ గత చిత్రాలతో పోలిస్తే.. ఈ సినిమాకు తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఏరియాల వారీగా చూస్తే.. నైజాంలో రూ.4.51 కోట్లు, సీడెడ్ 2.02 కోట్లు, యూఏ 1.84 కోట్లు, తూర్పు గోదావరి 1.32 కోట్లు, పశ్చిమ గోదావరి 1.85 కోట్లు, గుంటూరు 2.08 కోట్లు, కృష్ణ 1.03 కోట్లు, నెల్లూరులో 73 లక్షలు వసూళ్లు రాబట్టినట్లు చెబుతున్నారు. ఈ చిత్రానికి రూ.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే రూ.82 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆ రేంజ్ కలెక్షన్స్ కష్టమేనని అంచనా వేస్తున్నారు.దీనికితోడు జైలర్ మూవీకి హిట్ టాక్ రావడంతో భోళా శంకర్‌పై భారీ ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. వరుసగా సెలవులు వచ్చినా.. కలెక్షన్స్ పెద్దగా పెరిగే అవకాశాలు లేదని చెబుతున్నారు. 🎥🎞️


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page