🔵 బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి భారతరత్నకు ఎంపికైన సంగతి తెలిసిందే. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో ఆయనను గౌరవించింది కేంద్రం.
ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ తరానికి చెందిన గొప్ప రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరని.. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని.. ప్రధానిగా దేశానికి సేవ చేశారని.. పార్లమెంట్ లో ఆయన అనుభవం ఎన్నటికీ ఆదర్శప్రాయమని.. ఆయన సుధీర్ఘ రాజకీయ జీవితం నుంచి ఎన్నో నేర్చుకోవచ్చని.. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అసమాన కృషి చేశారని.. ఆయనకు ఈ పురస్కారం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని.. ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం రావడం.. ఆయన నుంచి నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తానంటూ రాసుకొచ్చారు ప్రధాని మోదీ. ఈ క్రమంలోనే ఎల్కే అద్వానీకి సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అద్వానీ నిస్సందేహంగా భారతరత్నకు అర్హులు అని ట్వీట్ చేశారు. 🎉🇮🇳