top of page
MediaFx

“భారతీయుడు 2” ఆడియో లాంచ్, రెండో సాంగ్ కి డేట్స్ ఫిక్స్.!

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా, సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “భారతీయుడు 2” చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ క్రేజీ సీక్వెల్ పై ఫస్ట్ సింగిల్ తోనే మంచి హైప్ ఏర్పడింది. ఇప్పుడు ఈ సినిమా నుండి మేకర్స్ రెండో సాంగ్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

ఈసారి స్పెషల్ అప్డేట్ గా, కమల్ హీరో అయినప్పటికీ, సిద్ధార్థ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ పై ప్లాన్ చేసిన రెండో సాంగ్ పోస్టర్ తో మే 29న విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేసారు.

అలాగే, గ్రాండ్ ఆడియో లాంచ్ ని జూన్ 1న తమిళనాడులో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తరువాత తెలుగులో కూడా తప్పకుండా చేయవచ్చు. ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా, లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు. ఈ సినిమా జూలై 12న పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

bottom of page