top of page

తెలంగాణ యాసలో అదరగొట్టిన బాలయ్య భగవంత్ కేసరి టీజర్ రిలీజ్..

మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.


డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తోన్న చిత్రం భగవంత్ కేసరి. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో సైతం బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించడంతో ఈ మూవీ మరింత క్యూరియాసిటి ఏర్పడింది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. హైదరాబాద్ శ్రీ భ్రమరాంబ థియేటర్ లో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి టీజర్ లాంచ్ ని చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు. బాలయ్య అభిమానులు సందడి చేశారు.

ఈ సినిమా తెలంగాణ యాసలో తెరకెక్కుతుంది. ఒక నిమిషం15 సెకండ్స్ ఉన్న టీజర్ లో బాలయ్యని మరోసారి మాస్ గా చూపించబోతున్నారు. ఈసారి తెలంగాణ మాస్ లో చూపించబోతున్నారు అనిల్. తెలంగాణ యాసలో, హిందీలో డైలాగ్స్ చెప్పి బాలయ్య అదరగొట్టారు. మాస్ BGM తో పాటు చివర్లో క్లాస్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నేలకొండ భగవత్ కేసరి.. ఈ పేరు చాలా యేండ్లు యాద్ ఉంటది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. విజయ దశమి కానుకగా ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.


Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page