top of page
MediaFx

దుమ్ములేపిన శామ్సంగ్, యాపిల్.. ఎన్ని ఫోన్లు అమ్ముడయ్యాయో తెలుసా?

స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వాటి అమ్మకాలలోనూ పోటీ నెలకొంది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వివిధ ఫీచర్లతో ఫోన్లు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. వాటిలో కొన్ని ప్రత్యేకతను నిలుపుకొని అమ్మకాలలో రాకెట్లు మాదిరిగా దూసుకుపోతున్నాయి. ప్రముఖ బ్రాండ్లు విడుదల చేసిన ఫీచర్ ఫోన్ల అమ్మకాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. 2024 సంవత్సరం మొదటి త్రైమాసికంలో (మూడు నెలలు) అంటే క్యూ వన్ లో అధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్ల వివరాలు తెలుసుకుందాం.

మొదటి త్రైమాసికంలో..

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆపిల్, శామ్‌సంగ్ కంపెనీలు తమ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా వంటి టాప్ మోడళ్లతో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో ఆధిపత్యం చెలాయించాయి. ముఖ్యంగా ఐఫోన్ 15 ప్రో మాక్స్ అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా రికార్డు నెలకొల్పింది. దీనిని ఇతర ఐఫోన్లు అనుసరించాయి. ఆపిల్, సామ్సంగ్ రెండూ ఐదేసి స్థానాలను పొందాయి. ఆ జాబితాలో ఇతర కంపెనీలకు అసలు చోటు దక్కలేదు. అలాగే ఈ త్రైమాసికంలో టాప్ టెన్ స్మార్ట్‌ఫోన్ల న్నీ 5జీ కావడం విశేషం. జాబితాలోని టాప్ టెన్ స్మార్ట్ ఫోన్లలో ఏడు ప్రీమియం కేటగిరీకి చెందినవి. (హోల్‌సేల్ ధర $600, అంతకంటే ఎక్కువ)

అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ ఫోన్లు..
  • ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మాక్స్

  • ఆపిల్ ఐఫోన్ 1.5

  • ఆపిల్ ఐఫోన్ 15 ప్రో

  • ఆపిల్ ఐఫోన్ 14

  • సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా

  • సామ్సంగ్ గెలాక్సీ ఏ15 5జీ

  • సామ్సంగ్ గెలాక్సీ ఏ54 5జీ

  • ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్

  • సామ్సంగ్ గెలాక్సీ ఎస్24

  • సామ్సంగ్ గెలాక్సీ ఏ34

అగ్రస్థానంలో ఆపిల్ ప్రోమాక్స్..

నాన్ సీజనల్ త్రైమాసికంలో ఆపిల్ ప్రో మాక్స్ వేరియంట్ అగ్రస్థానాన్ని పొందడం ఇదే మొదటిసారి. ఇది హై ఎండ్ స్మార్ట్‌ఫోన్లపై వినియోగదారులకు పెరుగుతున్న అభిరుచిని సూచిస్తుంది. ఐఫోన్ 15, ఐఫోన్ 14 కు సంబంధించిన నాలుగు వేరియంట్లు కూడా టాప్ టెన్ జాబితాలోకి వచ్చాయి. అలాగే ఐఫోన్ 15 లైనప్ మొదటి మూడు స్థానాలను పొందింది.

పెరిగిన ఆదాయం..

ఆపిల్ ఫోన్ల అమ్మకాలలో ఐఫోన్ ప్రో మోడళ్లు సగభాగం ఆక్రమించాయి. 2020 క్యూ వన్ తో పోలిస్తే ఈ త్రైమాసికంలో ప్రో మోడళ్ల అమ్మకాలు కూడా గణనీయంగా అంటే 24 శాతం పెరిగాయి. ఐఫోన్ ప్రో మోడళ్లు కూడా కంపెనీకి ప్రధాన ఆదాయంగా మారాయి. 2024 క్యూ వన్ అమ్మకాలలో విలువలో 60 శాతం దక్కించుకున్నాయి.

గెలాక్సీ ముందంజ..

సామ్సంగ్ కంపెనీ తాజాగా విడుదల చేసిన గెలాక్సీ ఎస్ 24 సిరీస్ కూడా 2024 క్యూ వన్ లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ ఫోన్ల జాబితాలో రెండు స్థానాలను పొందింది. అల్ట్రా వేరియంట్ ఐదు, బేస్ వేరియంట్ తొమ్మిదో స్థానాలలో నిలిచాయి. సామ్సంగ్ సంస్థ ప్రారంభంలోనే అప్ డేట్లు చేయడం, ఏ1 (జెన్ ఏ1) సాంకేతికతపై దృష్టి పెట్టడం ద్వారా అమ్మకాలలో గెలాక్సీ ఎస్ 24 సిరీస్ దూసుకుపోయిందని చెప్పవచ్చు.

bottom of page