top of page
MediaFx

ఓట్స్‌తో మసాలా గారెలు.. హెల్దీ బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్ రెసిపీ..


ఓట్స్ మసాలా గారెలకు కావాల్సిన పదార్థాలు:

ఓట్స్, పెరుగు, బియ్యం పిండి, మిరియాల పొడి, ఉప్పు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తరుగు, ఉల్లి తరుగు, ఆయిల్.

ఓట్స్ మసాలా గారెలు తయారీ విధానం:

ముందుగా ఓట్స్‌ని ఓ నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పొడిగా రుచి బాగోదు అనుకుంటే కొద్దిగా ఓటర్ వేసి ఓట్స్ నానబెట్టండి. దీంతో వాటర్ వేయకుండా పేస్టు తయారు చేసుకోవచ్చు. ఇందులో పెరుగు, బియ్యం పిండి, మిరియాల పొడి, ఉప్పు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తరుగు, ఉల్లి తరుగు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి. నూనె వేడి చేశాక.. ఇందులో మీకు నచ్చిన షేపులో గారెలను వత్తుకుని వేయండి. వీటిని రెండు వైపులా ఎర్రగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చట్నీలతో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి.

bottom of page