top of page
Suresh D

సమ్మర్‌లో కుండలోని నీరు తాగితే లాభాలివే..✨🩺

నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంత నీరు తాగితే ఆరోగ్యానికి అన్ని లాభాలుంటాయి. అయితే, ఆ నీటిని తాగేటప్పుడు కూడా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. చాలా మంది సమ్మర్‌లో చల్లగా ఉన్న ఫ్రిజ్ నీరు తాగేందుకు ఇష్టపడతారు. కానీ, అలా కాకుండా కుండలో నీరు తాగితే చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. 

సహజంగానే చల్లగా..

మట్టి కుండలో నీరు సహజంగా చల్లబడుతుంది. రిఫ్రిజిరేటర్‌లో నీటి కంటే ఇది చాలా బెటర్. దీనిని తాగడం వల్ల వేడి చేయడం వంటి సమస్యలు రావు.

జీర్ణ సమస్యలు రాకుండా..

కుండలని బంకమట్టితో తయారు చేస్తారు. ఇది సహజంగానే ఆల్కలీన్ కాబట్టి, నిల్వ చేసిన నీటి pH లెవల్స్ కంటే బ్యాలెన్డ్స్‌గా ఉంటుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు రావు. అంతేకాకుండా ఈ నీటిలో సహజ సిద్ధమైన ఖనిజాలు ఉంటాయి. కాబట్టి, ఈ నీటిని తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. దీని వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. మట్టికుండ నీటిలోని మలినాలను తొలగించి సూక్ష్మ జీవులకి వ్యతిరేకంగా పోరాడతాయి. మట్టికుండలో నీరు తాగితే అందులోని సహజ ఖనిజాలు ఉంటాయి. ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు. దీని కారణంగా మట్టికుండలోని నీరు మన జీర్ణక్రియని మెరుగ్గా చేస్తాయి.

ఒంట్లో వేడి తగ్గించడం..

సాధారణంగా ఈ నీటిని తాగితే ఇందులోని సహజ ఖనిజాలు ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. దీంతో వేడి వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం, కంటి సమస్యలు, చికాకు, దురద వంటి సమస్యలు దూరమవుతాయి. 

గొంతునొప్పి..

మట్టికుండ నీటిలో పోషకాలు, సహజ ఖనిజాలు మన బాడీలోని గాయాలను వేగంగా నయం చేస్తాయి. ఇది గాయాల వల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స్‌ని తగ్గిస్తాయి. వీటితో పాటు రిఫ్రిజరేటర్స్ వంటి గ్యాడ్జెట్స్ ద్వారా చల్లగా అయిన నీటి వల్ల గొంతు సమస్యలొస్తాయి. అలా కాకుండా ఈ మట్టి కుండలో నీటిని తాగితే గొంతు సమస్యలు దూరమవుతాయి.✨

Comments


bottom of page