top of page
Shiva YT

రష్మికతో డేటింగ్ రూమర్లపై..ఘాటుగా స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్..

ఎప్పుడూ సాఫ్ట్ గా కనిపించే యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అది కూడీ మీడియా పైన. అలాంటి వార్తలు ఎలా రాస్తారంటూ ఫైర్ అయ్యారు. ఇంతకీ ఎలాంటి వార్తలు..?


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నతో మీరు డేటింగ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై ఏమంటారు అని అడగగా..హీరో బెల్లంకొండ శ్రీనివాస్ స్పందించారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యంగ్ హీరో మాట్లాడుతూ.. ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఎలా రాయగలుగుతారు అంటూ మండి పడ్డారు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే.. అది ప్రేమించుకున్నట్టేనా అని ప్రశ్నించారు బెల్లంకొండ. రష్మిక మందన్నతో తాను డేటింగ్ లో ఉన్నాను అన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు బెల్లంకొండ. నేను రష్మిక, మంచి స్నేహితులం.. అప్పుడప్పుడు కలిసినప్పుడు మాట్లాడుకుంటాము.. షూటింగ్ పనిపై ముంబైకి వెళ్లినప్పుడు ఎయిర్ పోర్ట్ లో కలుసుకుంటూ ఉంటామని, అలా అనుకోకుండా కలుసుకున్న సందర్భాలు కూడా తక్కువేనని పేర్కొన్నారు. అంతమాత్రానికే ఇలాంటి వార్తలు రాసేస్తారా? అని ప్రశ్నించారు. అవన్నీ పుకార్లేనని, వాటిని నమ్మవద్దని బెల్లంకొండ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు విజయ్ దేవరకొండతో కూడా రష్మిక ప్రేమలో ఉన్నట్టు.. చాలా కాలంగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు ముంబయ్ లో డిన్నర్ డేట్లకు వెళ్ళి.. కెమెరా కళ్ళకు చిక్కారు ఈజంట. అంతే కాదు మాల్దీవ్స్ కు కూడా ఇద్దరు కలిసి ట్రిప్ వెళ్ళారంటూ.. సోషల్ మీడియా సాక్ష్యాలతో సహా బయట పెట్టింది. అయితే వీటిపై వారు ఎప్పుడూ స్పందించలేదు. కాని వీరి మధ్య ఏదో జరుగుతుంది అని మాత్రం సోషల్ మీడియా కోడై కూసింది. ఇక తాజాగా బెల్లంకొండతో కూడా ఇలా రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి.

bottom of page