top of page
Suresh D

రైల్వే స్టేషన్‎లో ప్రయాణికులను పరుగులు పెట్టించిన తేనెటీగలు ..✨

శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతంలోని మందస రోడ్ రైల్వే స్టేషన్‎లో ఇటీవల తరచూ తేనెటీగలు చెలరేగిపోతున్నాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భువనేశ్వర్, విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్‎ప్రెస్ రైలు కోసం మందస రోడ్ రైల్వేస్టేషన్‎లో ప్రయాణికులు నిరీక్షిస్తుండగా ఒక్కసారిగా తేనె టీగలు విరుచుకుపడ్డాయి. గుంపుగా వచ్చి ఫ్లాట్ ఫామ్‎పై ఉన్న ప్రయాణికులపై దాడి చేశాయి. అయితే ఊహించని ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ట్రైన్ కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు అంతా చెరో దిక్కు పరుగులు పెట్టారు. కొందరైతే గోనె సంచులు ఒంటిపై కప్పుకొని వాటి దాడి నుండి రక్షించుకునేందుకు యత్నించారు. మొత్తానికి తేనెటీగల దాడిలో సుమారు 20 మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు. 

సరిగ్గా భువనేశ్వర్ టు విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్‎ప్రెస్ రైలు వచ్చే సమయానికే తేనె తీగలు ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాయి. దాంతో అంతవరకు ట్రైన్ కోసం ఫ్లాట్ ఫామ్‎పై నిరీక్షించిన ప్రయాణికులంతా తమను తాము రక్షించుకునేందుకు పరుగులు పెట్టారు. అదే సమయంలో ట్రైన్ రావటంతో ట్రైన్‎ను అందులోలేకపోయారు. దీంతో టికెట్ తీసుకొని మరీ ట్రైన్ ఎక్కలేకపోయామని ఆవేదన చెందారు. అయితే ఈ రైల్వే స్టేషన్లో మూడు రోజుల కిందట కూడా తేనెటీగలు ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాయి. అప్పుడు ఇలాగే పరుగులు పెట్టారు ప్రయాణికులు. అప్పుడు పది మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు. అయితే మూడు రోజుల వ్యవధిలో రెండవసారి తేనెటీగలు దాడి చేయటంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు మళ్ళీ ఎప్పుడు దాడి చేస్తాయా అన్నట్లు రైల్వే స్టేషన్‎లోని మూడు పెద్ద చెట్లపై 12 పెద్ద తేనె పుట్టలు కనిపిస్తుండటంతో ప్రయాణికులు ఇప్పుడు మరింత ఆందోళనకు గురవుతున్నారు. చెట్లపై తిష్ట వేసిన తేనెటీగలను రైల్వే అధికారులు తొలగించాలని కోరుతున్నారు.✨

bottom of page