top of page

ఈ సీజన్ లో బూట్లు, దుస్తులు ధరించే ముందు జాగ్రత్త..


వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సీజన్‌లో క్రిమికీటకాలతో పాటు పాములు, తేళ్లు వంటి విష ప్రాణులు కూడా చురుకుగా కదులుతూ ఉంటాయి. ముఖ్యంగా పాములు నివసించే  రంధ్రాల్లోకి నీరు చేరినప్పుడు.. అవి సురక్షితమైన ప్రదేశాలను వెతుకుతు ఇంటిలో, ఇళ్ల పరిశరాల్లో చేరుకుంటాయి. అటువంటి పరిస్థితిలో బట్టలు , బూట్లు ధరించే ముందు వాటిని పూర్తిగా దుమ్ము దులపాలి. వీటిల్లో ఏ ప్రమాదకరమైన జీవి దాగి ఉంటుందో ఎవరికి తెలుసు. ఇప్పుడు వైరల్‌గా మారిన ఈ షూ క్లిప్‌ని చూడండి. అది ధరించాల్సిన యువతి చివరి క్షణంలో షూ లో ఉన్న నాగుపామును చూడటం అదృష్టం. లేకుండా ఏ చిన్న పొరపాటు జరిగినా పాము .. ఆ బాలికను కాటు వేసేది.

వైరల్ అవుతున్న వీడియోలో నాగుపాము షూ లోపల  దాగి ఉంది. అయితే ఈ విషయాన్నీ గమనించకుండా బాలిక ధరించి ఉంటే.. పాముకాటు కారణంగా చనిపోయేది. అందువల్ల వర్షాకాలంలో ఎల్లప్పుడూ బూట్లు,  బట్టలు వంటి వాటిని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ధరించండి. తద్వారా ఏదైనా అవాంఛిత  సంఘటనలు జరగకుండా చూడవచ్చు. షూలో ఉన్న పామును చూసిన వెంటనే ఆ బాలిక భయంతో కేకలు వేయడం ప్రారంభించింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పాము పట్టే వ్యక్తికి ఫోన్ చేయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పాము పట్టే వ్యక్తి కర్రను షూలో ఉంచిన వెంటనే  నాగుపాము పడగ విప్పి నిల్చున్నట్లు వైరల్ అవుతున్న  వీడియోలో చూడవచ్చు. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు మరోసారి కేకలు వేశారు.



Commentaires


bottom of page